విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగనన్న పరిపాలనలో ప్రజలందరూ సురక్షితంగా ఉన్నారని ప్రతి ఒక్కరికి సంక్షేమ లబ్ది అందుతుంది అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 3వ డివిజన్ రామచంద్ర నగర్ మెయిన్ రోడ్,భాయన బాపూజీ రోడ్,ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ రోడ్ ప్రాంతాల్లో అవినాష్ ప్రతి గడపకు వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి, చేస్తున్న అభివృద్ధి గురించి వివరించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుని, అర్హత ఉండి పథకాలు అందని వారు ఉంటే, వారి వివరాలు సేకరించి పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు, వాలంటీర్లకు మరియు సచివాలయ సిబ్బందికి సూచించారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మూడుపువ్వులు-ఆరు కాయలుగా ఉందని, ప్రజలందరూ ఏడు రోజులుగా ఇంటి ఇంటికి వెళ్తుంటే సంతోషంగా ఆహవనిస్తున్నారు అని అన్నారు . తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలెవరు నమ్మడం లేదని అన్నారు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు కబుర్లు మాత్రమే చెప్పేవారని, వైస్సార్సీపీ ప్రభుత్వం చెప్పింది చేతల్లో చేసి చూపిస్తున్నారని తెలిపారు. వాళ్లు చేసేటప్పుడు అంతా కాగితాలపై, పొద్దున్న పేపర్లలో మాత్రమే ఉండేదని, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంతా ప్రజల చేతికి అందుతోందని, క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్నాయని అని అన్నారు.ప్రజలకు ఏ కష్టం రాకుండా ఎక్కడికక్కడ సచివాలయాలు, వాలంటీర్లను నియమించారని తెలిపారు. అన్ని సంక్షేమ పథకాలు కూడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా అంతా పారదర్శకంగా అర్హులైన అందరి బ్యాంకు ఖాతాల్లో చేరుతోందని తెలిపారు. ఇంతటి గొప్ప పరిపాలన దేశంలో మరెక్కడా లేదని తెలిపారు. ఈ డివిజన్ లో నాడు స్వర్గీయ దేవినేని నెహ్రు ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది అని,నేడు మల్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాకా రోడ్లు,డ్రైన్ లు అన్ని అభివృద్ది పరచడం జరిగిందన్నారు.తెలుగుదేశం హయాంలో తుర్పి నియోజకవర్గ అభివృద్ధి శున్యం అన్నారు.వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకా అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.గతంలో ఈ ప్రాంత అభివృద్ధి గురుంచి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దృష్టికి కాలనీ పెద్దలు, ప్రజలు ఎన్నిసార్లు తీసుకెళ్లిన సరే చేద్దాం, చూద్దాం అంటూ కాలయాపన చేసారే తప్ప పట్టించుకోలేదు అని,వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ 3వ డివిజన్లలో కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నాతో పాటు,లక్షలాది మంది ప్రజలు సమర్దిస్తున్నారని అన్నారు.రాబోయే 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి గా ఉంటారని ఉద్ఘటించారు. ఇక్కడి షో మాస్టర్,టీడీపీ నాయకులు వాళ్ళు అధికారంలోకి వచ్చినట్టు కలలు కంటున్నారని అది ఎన్నటికీ జరగదు అని అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ్,3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక,కో ఆప్షన్ సభ్యులు ముసునూరి సుబ్బారావు,వైస్సార్సీపీ నాయకులు ఏలూరి శివాజీ,పూర్ణచంద్ర రావు,దాడి సుబ్బారావు,సజ్జా కృష్ణ,డేవిడ్ రాజు,వెంకట స్వామి, ఆనంద్,భీమిశెట్టి శ్రీనివాస్ రావు,రామకృష్ణ,సీతారామయ్య,కోటేశ్వర రావు,కొండయ్య దితరులు పాల్గొన్నారు.
ఆర్థిక సహాయం
తూర్పు నియోజకవర్గ పరిధిలోని వ డివిజన్ లో రామచంద్ర నగర్ లో తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పర్యటించినప్పుడు నిరుపేద వృద్ధుడు ఆనురి మురళీకృష్ణ వారికి వైద్య ఖర్చులు నిమిత్తం ‘దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలో విద్య, వైద్య, ఉపాధి రంగాలలో అనేక సేవ కార్యక్రమాలు చేపడుతున్నాం అని అన్నారు. భవిష్యత్తు లో ఇలాగే అవసరమైన నిరుపేద కుటంబాలకు దేవినేని నెహ్రు ట్రస్ట్ ద్వారా సేవ కార్యక్రమాలు కొనసాగిస్తాం అన్నారు.
Prajavartha Online Telugu News