-పాఠశాల విద్యాశాఖ కమీషనర్& సమగ్ర శిక్షా ఎస్పీడీ ఎస్. సురేష్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత గల విద్యని అందించడానికి విద్యాంజలి 2.0, స్వచ్ఛంద సేవల కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టాము. సెప్టెంబర్ 7, 2021 న ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని పౌరులందరూ తమకు నచ్చిన రంగంలో సమీప పాఠశాలలకు స్వచ్ఛంద సేవలు అందించవచ్చును. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలలో విద్యానాణ్యతని పెంపొందించుకోవడానికి ఆర్జెడీలు జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్షా అదనపు సమన్వయకర్తలు ,ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల కార్యవర్గo, తల్లిదండ్రులు విద్యాంజలి 2.0, కార్యక్రమాన్ని సత్వరమే అమలు పరచాలి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ పాఠశాల కు కావలసిన విద్యా వనరులను ,సామాగ్రిని మధ్యాహ్న భోజన పథకం, నీటి వసతి, స్వయం ఉపాధి కోర్సుల నిర్వహణ, కంప్యూటర్ బోధన, అదనపు తరగతి గదులు, బోధన అభ్యసన సామాగ్రి, స్పోర్ట్స్ మెటీరియల్ ,కంప్యూటర్లు మొదలైన అంశాలన్నిటిలోనూ వారి వారి అవసరాలని విద్యాంజలి పోర్టల్ లో పాఠశాల తరఫున నమోదు చేసుకుని , పాఠశాల అవసరాలకు ఆధారంగా స్వచ్ఛంద కార్యకర్తలు కూడా తాము అందజేయగలిగినటువంటి సేవలను విద్యాంజలి పోర్టల్ లో నమోదు చేసుకుని ఆయా పాఠశాలలకు అందించాలి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రాంతీయ విద్యా సంచాలకులు , విద్యా సంబంధిత అధికారులు అన్ని స్థాయిలలో స్వచ్ఛంద సంస్థలతో సమావేశాలు జరిపి విద్యాంజలి కార్యక్రమ వివరాలని విస్తృతంగా అందరికీ తెలియచేయాలి.
దీనికిగాను ముందుగా ప్రధానోపాధ్యాయులు విద్యాంజలి 2.0 ఆన్లైన్ పోర్టల్ లో తమ పాఠశాల పేరుని తప్పనిసరిగా నమోదు చేసుకుని వారికి కావలసిన అవసరాలను అందులో పొందుపరచాలి. తమ పాఠశాలలకు సేవలందించగలిగిన వాలంటీర్లను కూడా గుర్తించి పాఠశాల యాజమాన్య కమిటీల ద్వారా ఆయా సేవలను పొందాలి. ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులను నాణ్యమైన విద్య కార్యక్రమాలను అందించడానికి స్వచ్ఛందంగా అందరూ పౌరులు, పరిశ్రమ అధికారులు స్వచ్ఛంద సంస్థలు ఇతర దేశాల్లో భారతీయ సంతతికి చెందిన వారు ముందుకు వచ్చి విద్యాంజలి కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో జయప్రదం చేయాలి.
Prajavartha Online Telugu News