Breaking News

Latest News

ఆంధ్రప్రదేశ్ లో ఫ్లెక్సీ ప్రింటింగ్ రంగాన్ని ఆదుకోవాలి… : రాజశేఖర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఆంధ్ర ప్రదేశ్ ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్ లో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్లెక్సీ నిషేధం నవంబర్ ఒకటో తేదీ నుండి అమలు చేయాలని జీవో ఇచ్చారని జీవోలో ఫ్లెక్సీలో పర్యావరణానికి హాని కలిగిస్తుందని జీవోలో పేర్కొన్నారని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం 100 మైక్రోన్స్ కన్నా ఎక్కువ వాడుకోవచ్చని మేము 200 మైక్రోన్స్ నుండి 500 మైక్రోన్స్ వరకు మెటీరియల్ వాడుతున్నామని అందువల్ల …

Read More »

మొదటిరోజు కనకదుర్గమ్మ వారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై సోమవారం దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు బుధవారం ఉదయం శంఖానాథంతో ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, అమ్మవారు పెళ్లిరోజు స్వర్ణ కవచాలం కృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారం తెల్లవారుజాము నుంచి అమ్మవారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 11 గంటల వరకు భక్తులకు కనకదుర్గమ్మ దర్శనం కల్పించారు. నవరాత్రి ఉత్సవాల తొలిరోజున ఇంద్రకీలాద్రిపై అధిక సంఖ్యలో మహిళలు మెట్ల పూజలు చేయడం కనిపించింది. కొందరు …

Read More »

వాటర్ రోయింగ్ క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేసిన ఆకుల శ్రీనివాస్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: గుజరాత్ లో జరగనున్న వాటర్ రోయింగ్ స్పోర్ట్స్ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులు విజేతలుగా నిలిచి విజయవాడ నగరానికి మంచి పేరు కావాలని ప్రముఖ వ్యాపారవేత్త ,సీనియర్ రాజకీయ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ ఆకాంక్షించారు. సోమవారం కృష్ణా నది ఒడ్డున వాటర్ స్పోర్ట్స్ క్రీడాకారులకు వాటర్ స్పోర్ట్స్ కిట్లను ఆకుల శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరం పక్కనే కృష్ణా నది ఉండడం విజయవాడ నగర ప్రజల అదృష్టమని అన్నారు. కృష్ణా నది నగరానికి ప్రక్కనే …

Read More »

అయ్యప్ప మహాసంగమం కరపత్రాల ఆవిష్కరణ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: నగరంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో నవంబర్‌ 19, 20 తేదీల్లో నిర్వహించే అయ్యప్ప మహా సంగమం ప్రచార కరపత్రాల ఆవిష్కరణ జరిగింది. ఆదివారం సత్యనారాయణపురంలోని గాయత్రి కన్వెన్షన్‌ హాల్లో జరిగిన గురుస్వాముల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావులు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌, సెంట్రల్‌ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్న విజయవాడ నగరంలో అఖిల …

Read More »

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి ఆర్.కే. రోజా

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్.కే.రోజా ఆదివారం నాడు విశాఖ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఆలయ పూజారులు, అధికారులతో వేదలాంచనలతో మంత్రిని ఆలయంలోకి ఆహ్వానించారు. శ్రీ వరాహ లక్ష్మీనరసింహా స్వామిని దర్శించుకున్నారు. సింహాచలం రావడం చాలా సంతోషంగా ఉందని, శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి రోజా తెలిపారు.

Read More »

బాలుగారంటే ఒక వ్యక్తి కాదు…నిలువెత్తు సంస్కారం… : మంత్రి రోజా

-విశాఖలో ఘనంగా ఎస్పీ బాలు రెండవ వర్ధంతి విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త: గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం స్మృత్యంజలి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆర్.కే.రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాక్మీ ప్రతాప్ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖ కళాభారతిలో బాలు రెండో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రోజా మాట్లాడుతూ మంత్రి రోజా మాట్లాడుతూ బాలు గారు ప్రపంచ దేశాల్లో తెలుగు పాట ద్వారా మనందరికి గుర్తింపు తెచ్చారు. ఆయన మనల్నివదలి రెండు …

Read More »

ఈనెల 27, 28 ముఖ్యమంత్రి పర్యటన… : జిల్లా కలెక్టర్, ఎస్. పి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 27 న తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించ నున్నారని అలాగే పలు కార్యక్రమాల్లో పాల్గొన నున్నారని పర్యటనలో చిన్నపాటి లోపాలు కూడా తలెత్త రాదని విధులు కేటాయించిన అధికారులు అప్రమత్తంగా వుండి పర్యటన విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి ఆదేశించారు. ఆదివారం  రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి పర్యటనపై అధికారులతో జిల్లా కలెక్టర్, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి , జెసి డీకే బాలాజీ లు సమావేశమై …

Read More »

వ్యవస్థలను నాశనం చేస్తే సమాజం పురోగమించదు… : అజేయ కల్లం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: సమాజంలో ఉన్న వ్యవస్థలను నాశనం చేసుకుంటూ పోతే సమాజ పురోగమనం పతనమవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు అజేయకల్లం పేర్కొన్నారు.ఈనెల 25వ తేది గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో డాక్టర్ కొమ్మారెడ్డి రాజా రామమోహన్ రావు శతజయంతి సందర్భంగా ఇండియా @ 75 అవకాశాలు – వాస్తవాలపై జరిగిన రాష్ట్ర స్థాయి సెమినార్ లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సభకు జనచైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా అజేయకల్లం ప్రసంగిస్తూ …

Read More »

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ది.26.09.2022వ తేదీ నుండి 05.10.2022వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేడుకలను పురష్కరించుకుని అనవాయితీగా వస్తున్న సాంప్రదాయం నేపథ్యంలో నగర పోలీస్ కమీషనర్  కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్., సతీ సమేతంగా ది.25.09.2022వ తేదీ సాయంత్రం అమ్మవారికి పసుపు, కుండుమ, పువ్వులు, పండ్లు మరియు పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా పోలీస్ కమీషనర్ దంపతులు వన్ టౌన్ …

Read More »

భక్తులు అమ్మవారి దర్శనం చేసుకునేలా విధులు నిర్వహించాలి… : నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ది.26.09.2022 వ తేదీ నుండి ది.05.10.2022వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా జరిగే దసరా ఉత్సవాల వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా వివిధ సుదూర ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. ఈ నేపథ్యంలో నగరానికి విచ్చేసే భక్తులు మరియు యాత్రికుల భద్రత దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలకు తావు లేకుండా నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్., ఆధ్వర్యంలో ప్రణాళికాబద్దంగా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు …

Read More »