-చట్టసభల స్థాయి తగ్గించడం దేశానికి మంచిది కాదు -ఇంట్లో, గుడిలో, బడిలో మాతృభాషలోనే మాట్లాడాలి -ప్రజాస్వామ్యంలో పార్టీలు మారడం మంచి పద్ధతి కాదు -మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గుంటూరు, నేటి పత్రిక ప్రజా వార్త : చట్టసభల స్థాయి తగ్గించడం దేశానికి మంచిదికాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. చట్టసభల్లో ఉండేవారు మరింత బాధ్యతగా ఉండాలని సూచించారు. గుంటూరులో జరిగిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన ఆయన భాష హుందాతనంగా ఉండాలన్నారు. మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. మాతృభాషలో చదివిన చాలామంది అత్యున్నత స్థానాలకు …
Read More »Latest News
భారతీయ మత్స్య రంగం శ్రేయస్సు దిశగా అడుగులు
-కేంద్ర మత్స్య , పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి. -డాక్టర్ ఎల్ మురుగన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : పరిణామ చక్రం లోనే కాదు, అన్ని ప్రధాన ప్రాచీన నాగరికతల కథల్లోనూ ‘చేప’ ప్రముఖ స్థానాన్ని పొందింది. మన పురాణాలు శ్రీ మహావిష్ణువు మొదటి అవతారమైన మత్స్యావతారం గురించి చెబుతాయి. ప్రాచీన తమిళనాడులోని అందమైన సంగం సాహిత్యం మత్స్యకారుల జీవితాల గురించి వంపుతిరిగిన పడవల గురించి (అకననూరు) స్పష్టంగా వివరణలు ఉన్నాయి. సింధు లోయ తవ్వకాలు …
Read More »జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు క్రీడావిద్యార్థులకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్లు, క్లబ్బుల వివరాలు, ఆర్థిక సహాయం వంటి క్రీడా కారులకు అవసరమైన పలు వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు. జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్‌ను క్రీడాకారులు, క్రీడా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని …
Read More »గ్రామాల్లో జగనన్న స్వచ్చం సంకల్పం నూరు శాతం ఫలితాలు సాధించాలి…
-పౌర సేవలు విషయంలో జవాబుదారీ తనం ముఖ్యం.. -జిల్లా ఈవో పిఆర్డీ, పంచాయితీ కార్యదర్శుల సమావేశంలో .. కలెక్టరు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజా వార్త : పారిశుధ్య సేవలు అందించి ప్రతి గ్రామాన్ని స్వచ్చగ్రామాలుగా తీర్చిదిద్దాల్సిన భాద్యత గ్రామ పంచాయితీలదేనని ఇందుకు ఈవోపిఆర్డీలు, పంచాయితీ కార్యదర్శులు వ్యక్తిగత భాద్యతలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత ఆదేశించారు. శుక్రవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనంకళాకేంద్రంలో జగనన్న స్వచ్చ సంకల్పం, క్లాప్ మిత్ర, స్వమిత్ర, టాక్స్ కలెక్షన్, స్పందన,ఎస్ డబ్ల్యూ పీసీ నిర్వహణ …
Read More »అబార్షన్లు పై అధ్యయనం చేసి, సమగ్ర నివేదిక ఇవ్వాలి
-జూమ్ సమావేశంలో పాల్గొన్న మొదటి అదనపు జిల్లా జడ్జి కే.సునీత -భ్రూణ హత్యలను తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది -డేకాఇట్ ఆపరేషన్ చేపట్టి ఉల్లంఘన చేసే వారిని గుర్తించాలి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజా వార్త : సమాజం ఇంతగా అభివృద్ధి సాధించినా ఇంకా భ్రూణ హత్యలు జరగడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత అన్నారు. స్కాన్, డయోగ్నిటిక్ కేంద్రాలు, ఆసుపత్రులు, డాక్టర్లు ఎంతమాత్రం ఇటువంటి వాటిని ప్రోత్సహించ రాదన్నారు. శుక్రవారం పి ఎన్ డి టి యాక్ట్ …
Read More »మెగా జాబ్ మేళా లో 400 మందికి ఉద్యోగ అవకాశాలు
-ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి -సెప్టెంబర్ 14 న సిఎం చే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం – జిల్లా కలెక్టర్ మాధవీలత నల్లజర్ల, నేటి పత్రిక ప్రజా వార్త : రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతోందని, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం నల్లజర్ల ఏకేఆర్ జి ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో గోపాలపురం నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు స్థానిక శాసనసభ్యులు …
Read More »నివాస భవనం పనులు నాణ్యత తో కూడి త్వరితగతిన పూర్తి చెయ్యాలి…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజా వార్త : రెవెన్యూ డివిజన్ అధికారి వారి నివాస భవనం పనులు నాణ్యత తో కూడి త్వరితగతిన పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం రికార్డు రూమ్ ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఆర్డిఓ కార్యాలయం లో ఉన్న ప్రతి ఒక్క భూ సంబంధ, తదితర రికార్డులను స్కాన్ చేసి భద్రపరచడం కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీవో …
Read More »ఫారం 6 బి లో తప్పులు లేకుండా వివరాలను నమోదు చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : స్వచ్చందంగా ఆధార్ – ఓటర్ కార్డుకు అనుసందానంపై ప్రత్యేకంగా రూపొందించిన ఫారం 6 బి లో తప్పులు లేకుండా వివరాలను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, బూత్ లెవల్ అధికారులను ఆదేశించారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ఓటర్ల జాబితాకు ఆధార్ అనుసందానం, కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో మార్పులు, చేర్పులకు ఉద్దేశించిన వివిధ ఫారాలపై బూత్ స్థాయి అధికారులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ …
Read More »ప్రజా సమస్యలపై అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : ప్రజా సమస్యల పట్ల అధికారులు అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 33వ డివిజన్ శివరావు వీధి, 24వ డివిజన్ వేముల శ్యామలాదేవీ వీధులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్ పొంగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి రావడంతో ఆయా ప్రదేశాలను ఎమ్మెల్యే సందర్శించారు. 4 రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా.. ఎందుకు చర్యలు చేపట్టలేదని అధికారులను ప్రశ్నించారు. సమస్య పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై అధికారులతో చర్చించారు. వేముల …
Read More »అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశానికే దిక్సూచి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 27.70 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే దిక్సూచిగా నిలిచాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 28వ డివిజన్ భానునగన్ 3 వ వీధిలో రూ.16.02 లక్షలతో సీసీ రోడ్లు, రూ. 11.68 లక్షల నిధులతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్ పనులకు నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి శుక్రవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ …
Read More »