-ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 27.70 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే దిక్సూచిగా నిలిచాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 28వ డివిజన్ భానునగన్ 3 వ వీధిలో రూ.16.02 లక్షలతో సీసీ రోడ్లు, రూ. 11.68 లక్షల నిధులతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్ పనులకు నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి శుక్రవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ పనులు పూర్తయితే దాదాపు వంద కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. తెలుగుదేశం గత ఐదేళ్ల పాలనలో నియోజకవర్గానికి చేసింది శూన్యమని.. నగర అభివృద్ధికి కేటాయించిన నిధులను కూడా దారి మళ్లించారని ఆరోపించారు. కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిధులను సక్రమంగా వినియోగించి.. ప్రజలకు అన్నీ రకాల మౌలిక సదుపాయాలను కలిస్తున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన ప్రాంతాలపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. 28వ డివిజన్లో గడిచిన మూడేళ్లలో దాదాపు రూ. 2 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టగా.. సగానికి పైగా పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, డీఈ గురునాథం, ఏఈ వెంకటేష్, 33వ డివిజన్ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు కనపర్తి కొండా, యాదల శ్రీను, కమ్మిలి రత్న, వేదాంతం చైతన్య, చిన్నారావు, మండా రాము, ప్రబల శ్రీనివాస్, వెంకన్న, నారాయణ, ఈశ్వరరావు, వీఎంసీ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News