విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో కృష్ణా జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ జూనియర్ బాల బాలికల జట్లను ఎంపిక చేయనున్నట్లు జిల్లా కార్యదర్శి ఎం పవన్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 7, 8 తేదీలలో ఉరవకొండ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. సబ్ జూనియర్ విభాగంలో 1-1- 2007 తర్వాత పుట్టిన వారు …
Read More »Latest News
శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు
-ముక్కంటిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సెంట్రల్ నియోజకవర్గంలోని ఆలయాలన్నీ శివనామస్మరణతో మారుమ్రోగాయి. తెల్లవారుజామునుంచే ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శివరాత్రి శుభ సందర్భంగా మంగళవారం ముత్యాలంపాడులోని పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు సందర్శించారు. ఈ సందర్భంగా శివాలయంలో రుద్రాభిషేకం, రుద్రహోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొలుత మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి …
Read More »ముక్కంటి కరుణా కటాక్షాలు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలోని శివాలయాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. గవర్నర్ పేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం భక్తజన సంద్రమైంది. తెల్లవారు జామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు శివయ్యను దర్శించున్నారు. తేజో లింగానికి మహారుద్ర, చతుర్వేద మంత్రోచ్ఛారణల మధ్య పాలు, పవిత్ర జలాలతో అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం బిల్వ పత్రాలను శివలింగానికి సమర్పించారు. ఈ పూజాది కార్యక్రమాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని విఘ్నాధిపతికి ఆది పూజ …
Read More »శివానుగ్రహంతో రాష్ట్రంలో అద్భుత పాలన: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓంకార స్వరూపుడైన శంకరుని ధ్యానించే పవిత్రమైన రోజు మహా శివరాత్రి అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. మహాశివరాత్రి శుభ సందర్భంగా సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. తొలుత గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సృష్టి లయకారుడిగా శివుడిని భక్తి ప్రపత్తులతో కొలుస్తారని మల్లాది విష్ణు తెలిపారు. శివరాత్రి పర్వదినాన్ని భక్తి, శ్రద్దలతో జరుపుకుంటున్న ప్రజలందరికీ ఆ ముక్కంటి అనుగ్రహం లభించాలని ప్రార్థించారు. పరమశివుని కృపాకటాక్షాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ …
Read More »శివనామ స్మరణం సర్వపాపహరణం
-త్రిమూర్తి శివ జయంతి మహోత్సవాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శివనామ స్మరణం సర్వపాపహరణమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. సీతారామపురంలో బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన త్రిమూర్తి శివ జయంతి మహోత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓం నమశ్శివాయ: అని హృదయపూర్వకంగా ఆ శివయ్యను ధ్యానిస్తే.. మనసు ఎంతో నిర్మలమవుతుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. భక్తుల పాలిట పెన్నిధి అయిన శివుని …
Read More »జగనన్న తోడు కార్యక్రమం – చిరు వ్యాపారుల ఉపాధికి ఊతం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ.. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున 5,10,462 మంది చిరు వ్యాపారులకు రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాలు, రూ.16.16 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్ కలిపి మొత్తం రూ.526.62 కోట్లను తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ… 5,10,462 మందికి మంచి చేస్తూ… ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి …
Read More »జర్నలిస్టులకు ఇంటిస్థలం, ఇల్లు ఖాయం…
-వెటరన్ జర్నలిస్టుల వయోపరిమితిని 40 ఏళ్లకు కుదింపు -సీఎంతో చర్చించాక మిగిలిన సమస్యల పరిష్కారం -ఏపీయూడబ్ల్యూజే నేతలతో మంత్రి పేర్ని నాని అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు నిర్మించే విషయంపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఆ మేరకు ప్రక్రియ ప్రారంభం అయిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు. వీటిపై తగిన ఉత్తర్వులు కూడా వీలైనంత త్వరగా ఇస్తామని మంత్రి చెప్పారు. గత రెండున్నర …
Read More »మదనపల్లెలో లక్ష గొంతులతో జనగణమన ను వినిపిస్తాం…
-జాతీయ గీతాన్ని అవమానించేలా వైసీపీ ప్రభుత్వం -పోలీసులు అడ్డుకోవడం అమానుష చర్య -త్వరలో మదనపల్లెలో జనగణమనను లక్ష గొంతులతో వినిపిస్తాం – ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త : వైసీపీ ప్రభుత్వం దేశ ద్రోహానికి ఒడిగట్టిందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాక్షాత్తు జాతీయ గీతాన్ని ఆలపించిన మదనపల్లె పట్టణంలో జాతీయ గీతాన్ని స్మరించుకునే అవకాశాన్ని కూడా కల్పించకుండా పోలీసు …
Read More »రాష్ట్రంలో దాదాపు 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీ…
-నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన జగన్ రెడ్డి సర్కార్ -ఉపాధి కల్పనలో దిగజారిన ఏపీ ప్రభుత్వం – ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 2022 వరకూ భర్తీ చేసే 10వేల 143 ఉద్యోగాల వివరాలతో సీఎం జగన్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసినా ఇంతవరకు …
Read More »ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి…
-ధాన్యం కొనుగోలు చేయలేని దీన స్థితిలో జగన్ రెడ్డి ప్రభుత్వం -మార్చి 22కు 50లక్షల టన్నుల లక్ష్యం పూర్తి చేయాలి కానీ కల్లాల్లోనే లక్షల టన్నుల ధాన్యం – ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి విమర్శించారు. మార్చి 22కు 50లక్షల టన్నుల …
Read More »