విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో కృష్ణా జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ జూనియర్ బాల బాలికల జట్లను ఎంపిక చేయనున్నట్లు జిల్లా కార్యదర్శి ఎం పవన్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 7, 8 తేదీలలో ఉరవకొండ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. సబ్ జూనియర్ విభాగంలో 1-1- 2007 తర్వాత పుట్టిన వారు మాత్రమే పోటీల్లో పాల్గొనేందుకు అర్హులనీ, 1-1-2003 తర్వాత పుట్టిన వారు జూనియర్ విభాగంలో పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు 2వ తేదీ ఉదయం 7 గంటలకు 4 పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, ఆధార్ కార్డ్, డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ లతో సె లక్షన్స్ కు హాజరు కావాలన్నారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News