Breaking News

Latest News

జగనన్న పాలవెల్లువ విజయవంతంగా అమలు చేసే బాధ్యత గ్రామ డైరీ సంఘం కార్యదర్సులదే: జిల్లా కలెక్టర్ జె.నివాస్

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ప్రయోజనాలను పాడి రైతులకు తెలియజేసి పధకాన్ని విజయవంతంగా అమలు చేసే బాధ్యత గ్రామ డైరీ సంఘం కార్యదర్సులదేనని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ సమావేశపు హాలులో నూజివీడు, అగిరిపల్లి మండలాలకు చెందిన గ్రామ డైరీ సంఘ కార్యదర్సులు, ప్రమోటర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ పధకం పాడి రైతుల జీవన విధానాన్ని మారుస్తుందన్నారు. పశువులకు పోషకాలతో …

Read More »

నూజివీడు లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు : జిల్లా కలెక్టర్ జె.నివాస్

-శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తో కలిసి నిర్మాణ ప్రదేశం, తాత్కాలిక భవనాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడులో త్వరలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. నూజివీడులో గురువారం కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని, తాత్కాలిక భవనాలను స్థానిక శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావుతో కలిసి జిల్లా కలెక్టర్ జె. నివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ నూజివీడులో త్వరలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు …

Read More »

పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి జగనన్న పాలవెల్లువ పధకం : జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ ) డా. కె. మాధవీలత

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి జగనన్న పాలవెల్లువ పధకమని జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ ) డా. కె. మాధవీలత అన్నారు. స్థానిక వెలుగు కార్యాలయం ఆవరణలో జగనన్న పాలవెల్లువ పధకం గ్రామ డైరీ సంఘ కార్యదర్సులు, ప్రమోటర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. మాధవీలత మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ పధకాన్ని జిల్లాలో త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ప్రారంభించనున్నారన్నారు. ప్రైవేట్ డైరీల కన్నా వెన్న శాతం కొలవడంలో అమూల్ సంస్థ ఖచ్చితత్వాన్ని …

Read More »

క్షేత్ర స్థాయిలో పర్యటన అధికారులకు పలు ఆదేశాలు…

-కమిషనర్ ప్రసన్న వెంకటేష్  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పర్యటనలో భాగంగా కమిషనర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ బుడమేరు వంతెన పై పాడైన రైలింగ్ మరియు పాదచారులు నడిచే పుట్ పాత్ లకు తగిన మరమ్మత్తులు నిర్వహించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంలో ఏలూరు కాలువ అంచున అల్లూరి సీతారామరాజు పార్క్ వరకు కెనాల్ బండ్ వెంబడి గల చెత్త మరియు వ్యర్ధములను తొలగించి వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మరియు రోడ్ నందలి ప్యాచ్ వర్క్స …

Read More »

12వ తేది నుండి ప్రజలకు అందుబాటులో చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం…

-ప్రజలు సద్వినియోగ పరచుకోవాలి – కమిషనర్ ప్రసన్న వెంకటేష్  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిదిలోని పటమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం ది 12-12-2021 ఆదివారం నుండి అందుబాటులోనికి తీసుకురానున్నట్లు కమిషనర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. స్టేడియం నందు క్రీడాకారులకు ఇండోర్ షటిల్, ఇండోర్ జిమ్, ఇండోర్ యోగ, అవుట్ డోర్ వాలీబాల్, అవుట్ డోర్ టెన్నిస్ మొదలుగున్నవి ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావటం జరుగుతుందని అన్నారు. క్రీడలకు సంబందించి మరింత సమాచారం మరియు టైం స్లాట్ …

Read More »

జగనన్న జన్మదిన కానుక ‘సంపూర్ణ గృహ హక్కు పథకం’- శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్

-అర్హులందరూ ఓటీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి : నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాంబే కాలనీ హెచ్ బ్లాక్ కమ్యూనిటీ హాల్ నందు ఓటీఎస్ పై నియోజకవర్గ ప్రజలకు శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు గారి అధ్యక్షతన అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) శ్రీవాస్ నుపుర్ అజయ్ కుమార్, సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్, నవరత్నాలు కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌ నాగ నారాయణమూర్తి, …

Read More »

సమగ్ర విద్య కోసం సమష్టిగా ఆలోచించండి…

-పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్ -సమావేశంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు, డీఈవోలు, ఏపీసీలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పూర్వ ప్రాథమిక విద్య నుండి ప్లస్ టూ విద్య వరకు సమగ్రంగా అవలంబించాల్సిన ప్రణాళికలను, ఆచరణ ముసాయిదాలను ప్రస్తావిస్తూ సమగ్ర విద్యావిధానం కోసం సమష్టిగా ఆలోచించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్ గారు ఇటీవల జరిగిన ఇంటర్మీడియెట్ బోర్డు సమావేశ విషయాలను గుర్తు చేశారు. గురువారం ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా ఏపీసీలు, ఆర్జేడీలు, …

Read More »

Make Energy Conservation week a big success…

–Govt. gives direction to all district administrations -State to promote energy efficiency to meet growing energy demand, reduced expenditure and supply 24X7 quality power. -Energy Efficiency will help in achieving sustainability of power sector and overall economic development of the State. -Energy Minster Balineni Srinivasa Reddy asks energy department to ensure active involvement of all govt. departments at gross root …

Read More »

సుబ్రహ్మణ్య స్వామి వారు అవతరించిన రోజే ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి… : మంత్రి, డా. తానేటి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : లోకసంరక్షణార్ధం పరమశివుని తేజస్సు నుంచి సుబ్రహ్మణ్య స్వామి వారు అవతరించిన రోజే ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, డా. తానేటి వనిత అన్నారు. గురువారం సుబ్రహ్మణ్యషష్ఠి సందర్బంగా కొవ్వూరు సుబ్రహ్మణ్య స్వామిగుడి లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ఈ. ఓ, పురోహితులు పూర్ణకుభంతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి లేదా స్కందషష్ఠి అని, సుబ్బారాయషష్ఠి అని కూడా అంటారన్నారు. …

Read More »

అంతర్జాతీయ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఎలైవ ఎస్తిటిక్స్ ఆసుపత్రి ప్రారంభం… 

-అన్ని రకాల చర్మ, కేశ, దంత సమస్యలపై అధునాతన చికిత్స విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ డాక్టర్ అఫ్సర్, డాక్టర్ యాస్ మీన్ షేక్ ల ఆధ్వర్యంలోని ఎలైవ ఎస్తిటిక్స్ ఆసుపత్రిని బుధవారం ప్రారంభించబడింది. అత్యంత ప్రతిభావంతులైన ఇరువురు వైద్య నిపుణుల ఆధ్వర్యంలో క్లినిక్ ప్రారంభించబడటం సంతోషదాయకమని, నగర ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఎలైవ ఎస్తిటిక్స్ ఆసుపత్రిని ప్రారంభించారని వైసిపి తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. కొత్తవంతెన ఆంజనేయ స్వామి సమీపంలో ఎలైవ ఎస్తిటిక్స్ ఆసుపత్రి ప్రారంభానికి …

Read More »