Latest News

రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీలను అత్యుత్తమ విద్యా సంస్థలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక : రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర వెల్లడి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీలను అత్యుత్తమ విద్యా సంస్థలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర చెప్పారు స్థానిక త్రిబుల్ ఐటీ లో బుధవారం అడ్మిషన్స్ కు సంబంధించి కౌన్సెలింగ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటిలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్ధినీ విద్యార్థులను ఉద్దేశించి సతీష్ చంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీ లను అత్యుత్తమ విద్యాసంస్థలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి …

Read More »

విధి నిర్వహణలో భాద్యతా రాహిత్యంగా వ్యవహరించిన ముగ్గురు సచివాలయం సిబ్బందిని విధులు నుండి తొలగింపు…

-కమిషనర్ ప్రసన్న వెంకటేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ 38వ వార్డ్ సచివాలయం నందు విధులు నిర్వహిస్తున్న వార్డ్ సచివాలయ ఇన్ ఛార్జ్ పరిపాలన కార్యదర్శి ఎన్. రాజీవ్ కుమార్, వార్డ్ విద్య మరియు డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి వి.రాణి వార్డ్ ప్రణాళిక మరియు క్రమబద్దికరణ కార్యదర్శి ఎ.నాగలక్ష్మి లను విధి నిర్వహణలో అలసత్వం వహించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలుగజేసినందులకు కమిషనర్ వారి ఆదేశాలకు అనుగుణంగా విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారిచేయుట జరిగింది. 38వ …

Read More »

ఏపి గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ కు 15 మంది డైరెక్టర్ లుగా ప్రమాణ స్వీకారం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో డెవలప్ మెంట్ ఆఫ్ గ్రీన్ స్పేసెస్ అండ్ పార్క్స్ కార్యక్రమం క్రింద 32 పట్టణ ప్రాంతాలలో రూ. 92 కోట్లతో90 పార్క్ ల అభివృద్ధికి పనులు చేపట్టామని ఆంధ్ర ప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.రామారావు అన్నారు. విజయవాడ భవానీపురం వద్ద బెర్మ్ పార్క్ లో బుధవారం నిర్వహించిన ఆంధ్ర ప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమం చైర్మన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రామారావు …

Read More »

పోలవరం ప్రాజెక్టు, నిర్వాసితులకు కాలనీలను పకడ్బందీగా పూర్తి చేయాలి….

పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యత ఇస్తూ సాంకేతిక పరిజ్ఞానం, ఆర్ధిక అంశాల పరిధికి లోబడి పోలవరం ప్రాజెక్టు, నిర్వాసితులకు కాలనీలను పకడ్బందీగా పూర్తి చేయాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ ఝా స్పష్టం చేశారు. బుధవారం పోలవరం ప్రాజెక్టు సమావేశ మందిరంలో ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్ అండ్ ఆర్, ఐ టి డి ఏ, తదితర శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ ఝా మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టును …

Read More »

లేనిపోని ష్యురీటిలు ఇస్తే .. మీ ఆర్ధికస్థితి పై ప్రభావం… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్ధిక కష్టాల్లో ఉన్న బంధువులను, స్నేహితులను ఆదుకోవడం తప్పేమీ కాదని, వారికి లేనిపోని ష్యురీటిలు ఇచ్చి మరీ సహాయ పడటమనేది మీ ఆర్ధిక స్థితిపై ప్రభావం చూపేలా ఉండకూడదని ఎలాంటి సమస్య లేదనుకున్నప్పుడే సాయం చేయాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) సలహా ఇచ్చారు. బుధవారం ఉదయం శాసనసభ సమావేశాలకు హాజరయ్యేందుకు హడావిడిగా ప్రయాణమవుతూ సైతం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ …

Read More »

తమ భూములపై వేరె ఎవరూ సవాల్ చేయడానికి వీలు కాని శాశ్వత హక్కులు… : జె సి డాక్టర్ కె. మాధవీలత

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వామిత్వా ద్వారా దళారీ వ్యవస్థకు స్వస్తి పలుకుతూ పారదర్శకంగా, నిష్పాక్షికంగా, అవినీతికి తావు లేకుండా భూలావాదేవీలు, ప్రతి భూభాగానికి విశిష్ట గుర్తింపు సంఖ్య ,భూయజమానులకు తమ భూములపై వేరె ఎవరూ సవాల్ చేయడానికి వీలు కాని శాశ్వత హక్కులు కల్పించబడ్డాయని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ . కె. మాధవీలత తెలిపారు. బుధవారం ఉదయం ఆమె మచిలీపట్నం మండల పరిధిలోని పొట్లపాలెం గ్రామాన్ని సందర్శించారు. గ్రామ పంచాయితీ కార్యాలయంలోని రైతుభరోసా కేంద్రం వద్ద ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత …

Read More »

మహవీర్ ఆటోడయాగ్నోస్టిక్స్ తో కలిసి నూతన డీలర్ షిప్ సదుపాయం ప్రారంభించిన స్కోడా ఆటో… 

-సికింద్రాబాద్ లో అత్యాధునిక సేల్స్ బ్రాంచ్ షో రూమ్, మహవీర్ ఆటోను ప్రారంభించిన స్కోడా ఆటో; 222 చదరపు మీటర్ల ప్రాంతంలో ఈ అత్యాధునిక షోరూమ్ -ఇండియా 2.0 ప్రాజెక్ట్ క్రింద 100కు పైగా నగరాలలో అమ్మకాలు మరియు అమ్మకపు తరువాత సేవలతో సహా స్కోడా ఆటో ఇండియా ఇప్పుడు 170కు పైగా కస్టమర్ టచ్ పాయింట్లతో చేరుకోనుంది; రాబోయే సంవత్సరానికి 225 టచ్ పాయింట్లను అధిగమించనుంది సికింద్రాబాద్,  నేటి పత్రిక ప్రజావార్త : స్కోడా ఆటో ఇండియా తమ అత్యాధునిక డీలర్ షిప్ ను …

Read More »

మనోగతం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణాన్ని కాపాడుకుందాం – భవిష్యత్ తరాలకు మెరుగైన భూమిని అందిద్దాం విశాఖపట్నంలోని “అటవీ పరిశోధన, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థా కేంద్రం” సందర్శన నా విజ్ఞానయాత్రలో ముఖ్యమైనది. -ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మిత్రులారా… నేను భారత ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టిన నాటి నుంచి నా వివిధ పర్యటనల్లో భాగంగా భారతదేశంలో ఉన్న వివిధ విజ్ఞాన కేంద్రాల సందర్శనల ద్వారా ఎప్పటికప్పుడు “విజ్ఞాన యాత్ర”లను కొనసాగిస్తున్నాను అనే విషయం మీకు తెలిసిందే. ప్రస్తుతం విశాఖ పర్యటనలో భాగంగా ఈ …

Read More »

నన్ను క్షమించండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాపట్ల ఎంపి సురేష్ మీద అభియోగాలు మోపినందుకు క్షమించమని కోరుతున్నట్లు మేకల భానుమూర్తి తెలిపారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇబ్రహీంపట్నం మండలంలో నివశిస్తున్నానని, గత వారం తన కుటుంభంకు ప్రాణహాని ఉందని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఎంపి సురేష్ మీద ఆరోపణలు చేశానని తెలిపారు. తనకు మానసిక పరిస్థితి బాగోలేనందున అలా చెప్పవలసి వచ్చినదని తరువాత విషయము తెలుసుకుని బాధపడ్డానని, …

Read More »

జగనన్న స్వచ్చ సంకల్పాన్ని అన్నీ గ్రామాల్లో సమర్ధవంతంగా అమలు చేయాలి…

– ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించాలి. -సేకరించిన చెత్తను తప్పనిసరిగా చెత్త సంపద కేంద్రానికి తరలించి సంపదగా మార్చే ప్రక్రియ చేపట్టాలి. -పరిశరాలను పరిశుభ్రంగా వుంచి ప్రజల ఆరోగ్యం కాపాడాటం మన బాధ్యత. -పంచాయితీ కార్యదర్శులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి. -పంచాయితీరాజ్ రూరల్ డవలఫ్మెంట్ స్పెషల్ కమీషనర్ శాంతి ప్రియా పాండే విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న స్వచ్చ సంకల్ప కార్యక్రమాన్ని అన్నీ గ్రామాల్లో సమర్ధవంతంగా అమ చేయాలని పంచాయితీరాజ్ రూరల్ డవలఫ్మెంట్ స్పెషల్ కమీషనర్ శాంతి ప్రియా …

Read More »