Breaking News

లేనిపోని ష్యురీటిలు ఇస్తే .. మీ ఆర్ధికస్థితి పై ప్రభావం… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్ధిక కష్టాల్లో ఉన్న బంధువులను, స్నేహితులను ఆదుకోవడం తప్పేమీ కాదని, వారికి లేనిపోని ష్యురీటిలు ఇచ్చి మరీ సహాయ పడటమనేది మీ ఆర్ధిక స్థితిపై ప్రభావం చూపేలా ఉండకూడదని ఎలాంటి సమస్య లేదనుకున్నప్పుడే సాయం చేయాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) సలహా ఇచ్చారు.
బుధవారం ఉదయం శాసనసభ సమావేశాలకు హాజరయ్యేందుకు హడావిడిగా ప్రయాణమవుతూ సైతం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను నేరుగా ఆయన కలుసుకున్నారు. వారు పడుతున్న ఇబ్బందుల గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారించారు.
పామర్రులో ఒక సంస్థలో అటెండర్ గా పని చేసే ఒక మహిళ మంత్రిని కలిసి తన కష్టాన్ని చెప్పింది. తానూ పనిచేసే చోట ఒక వ్యక్తి శ్రీరామ్ చిట్ ఫండ్ కంపెనీ నుంచి మూడు లక్షల రూపాయల రుణం తీసుకున్నాడని ఆ మొత్తం ఆ వ్యక్తి చెల్లించక పోవడంతో తొలి ముగ్గురు వ్యక్తులను వదలి నాల్గవ ష్యురీటి సంతకం పెట్టిన తనని డబ్బు చెల్లించమని తీవ్ర వత్తిడి తీసుకువస్తున్నారని ఆమె వాపోయింది. వెంటనే ఆ డబ్బు చెల్లించకపోతే తన జీతం నుంచి రికవరీ చేస్తామని చిట్ ఫండ్ కంపెనీ ఉద్యోగులు రోజూ బెదిరిస్తున్నారని తెలిపింది. ఈ విషయమై స్పందించిన మంత్రి పేర్ని నాని నేరుగా ఆ చిట్ ఫండ్ కంపెనీ సి ఇ ఓ తో మాట్లాడి ఆమె పరిస్థితి వివరించి ఆమెపై సానుభూతి చూపాలని అభ్యర్ధించారు. తప్పక పరిశీలించి ఆమెకు సహాయపడతానని ఆ అధికారి మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని ఆమెతో మాట్లాడుతూ, మనమే కష్టాల్లో ఉన్నప్పుడు వేరొకరిని ఆదుకోవడం అన్నిసార్లు మంచి నిర్ణయం కాదని కొన్నిసార్లు బంధువులకు, స్నేహితులకు అప్పు ఇవ్వడం లేదా ఇప్పించడం వల్ల, డబ్బులు తిరిగి రాకపోగా సంబంధాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని, అందుకే ఆర్ధిక విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందేనని అది ఎమోషనల్గా బాధ కలిగించే విషయమే అయినా వాస్తవికతలో ఉండి ఆలోచించాలని ఆ మహిళకు సున్నితంగా బోధించారు.
స్థానిక గిలకలదిండికి చెందిన మల్లాడి నాగమణి అనే మహిళ మంత్రి వద్ద తన సమస్య చెప్పింది. మచిలీపట్నం కోనేరు సెంటర్ లో గల న్యూఫైన్ జ్యుయలరీ దుకాణంలో 2020 లో తన కుమార్తె చెవి దిద్దుల కోసం 25 వేల రూపాయలు చెల్లించామని ఇప్పటికి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఆ డబ్బులు చెల్లించడంలేదని సంబంధిత వ్యక్తి ఆచూకీ సైతం తెలియడం లేదని వివరించించింది. ఈ విషయమై స్పందించిన మంత్రి పేర్ని నాని ఆమెను సంబంధిత నగల దుకాణానికి తీసుకువెళ్లి ఆ వ్యాప్[ఆరి గూర్చి విచారణ చేయాలని 13 వ డివిజన్ ఇంచార్జ్ గాజుల భగవాన్ కు పురమాయించారు.
తన భర్త కసిమీకోట రాజేష్ బాబుకు మతిస్థిమితం లేదని దాంతో ఆయన కుటుంబాన్ని విడిచి ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లిపోయారని ఇనగుదురుపేటకు చెందిన కసిమీకోట సుధ అనే మహిళ మంత్రికి తెలిపింది. ఈ నెల 4 వ తారీఖున ఇనగుదురు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశానని తొలుత వారు అంతగా పట్టించుకోలేదని తమ దృష్టికి విషయాన్ని తీసుకు వచ్చినట్లు పోలీసులకు తెలియడంతో వారు దిశ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయమన్నారని, అక్కడ వారు ఇది తమ కేసు కాదని ఇనగుదురు పోలీస్ స్టేషన్ లోనే చెప్పాలని అన్నారని, మరల అక్కడకు వెళితే, సార్ లేరని , మళ్ళీ రమ్మని అంటున్నారని తర్వాత తన భర్త ఫోన్ నెంబర్ సిగ్నల్ టవర్ లొకేషన్ సామర్లకోట ప్రాంతంగా చూపిస్తుందని నీవే వెళ్లి మీ భర్తను తెచ్చుకోవాలని పోలీసులు చెబుతున్నారని, తనకు ఎవరూ లేరని, పిల్లలు తన భర్తపై బెంగపెట్టుకొని వున్నారని తన భర్తను తిరిగి ఇక్కడకు తీసుకువచ్చేలా సహాయం చేయమని ఆ మహిళ మంత్రిని వేడుకోంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *