-రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక రెవిన్యూ సదస్సులు.. -గ్రామాల అభివృద్ధిలో రెవెన్యూ సదస్సులు కీలకపాత్ర పోషిస్థాయి : జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి, డిసెంబర్ 10: రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక రెవిన్యూ సదస్సులని జిల్లా వ్యాప్తంగా జరుగుచున్న రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి మంగళవారం తిరుపతి జిల్లాలో చంద్రగిరి …
Read More »Daily Archives: December 10, 2024
రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వెలగపూడి సచివాలయంలో డిసెంబర్ 11, 12 తేదీల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరగనుంది. విజన్-2047 డాక్యుమెంట్, కొత్త పాలసీలు, రానున్న నాలుగున్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశాలపై 26 జిల్లాల కలెక్టర్లు, 40శాఖల అధిపతుల అభిప్రాయాన్ని సీఎం తెలుసుకోనున్నారు. RTGS, వ్యవసాయం, వాట్సాప్ గవర్నెన్స్, పట్టణాభివృద్ధి, CRDA, శాంతి భద్రతలు, హార్టీకల్చర్ సహా పలు అంశాలపై చర్చిస్తారు.
Read More »ఎక్సైజ్ కమిషనర్ నిషాత్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఎక్సైజ్) రాహుల్ దేవ్ శర్మ ఆకస్మిక తనిఖీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పన్ను రహిత మద్యం రవాణాను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని రాష్ట్ర అబ్కారీ శాఖ కమీషనర్ నిషాత్ కుమార్ స్పష్టం చేశారు. నిబంధనల మేరకు అధిక ధరలకు మద్యం విక్రయించకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్ నిషాత్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఎక్సైజ్) రాహుల్ దేవ్ శర్మ గరికపాడు అబ్కారీ చెక్-పోస్ట్‌లో మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పర్యటనలో భాగంగా చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించి వాటి పనితీరును …
Read More »మహిళా సాధికారత దిశగా ఐ.సి.ఏ.ఆర్-సి.టి.ఆర్.ఐ రాజమండ్రి మరియు గ్రామీణ ఫౌండేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందము
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (సిటిఆర్ఐ భవిష్యత్తులో NIRCA) రాజమండ్రి మరియు గ్రామీణ ఫౌండేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ న్యూఢిల్లీ వారి Grow project లో భాగంగా 10 డిసెంబర్ 2024న మహిళా సాధికారత దిశగా 5000 మంది మహిళలను ఔత్సాహిక పారిశ్రామికులుగా తీర్చిదిద్దే దిశగా అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సమావేశానికి ముఖ్య అధ్యక్షులుగా సిటిఆర్ఐ డైరెక్టర్ డా. మాగంటి శేషు మాధవ్ వ్యవహరించగా, గ్రామీణ ఫౌండేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ శత్రుప కాశ్యప్ విచ్చేశారు. …
Read More »“మానవ హక్కుల” పై న్యాయ విజ్ఞాన సదస్సు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు, ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్ లతో కలిసి మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా స్థానిక దానవాయిపేట లోని ఐ.సి.డి.ఎస్ ఆఫీసు నందు “మానవ హక్కుల” పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రకాష్ బాబు మాట్లాడుతూ ఎవ్వరికీ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం నిరాకరించబడరాదని అన్నారు. హక్కులు లేని మనిషి బానిసతో సమానం …
Read More »షెడ్యూల్డ్ కులాలలోని ఉప-వర్గీకరణపై విచారణ చేయడానికి కమిటి ఏర్పాటు
-మొమోరాండం/ రిప్రజంటేషన్స్ లను అందజేసేందుకు చివరి తేదీ జనవరి 9 -ఎమ్ సందీప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ అత్యున్నత న్యాయస్థానం (పంజాబ్ రాష్ట్రం & ఇతరులు Vs దేవిందర్ సింగ్ & ఇతరులు (సివిల్ అప్పీల్ నం. 2317 ఆఫ్ 2011), తేదీ: 01.08.2024 న వెలువరించిన తీర్పు ననుసరించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలలోని ఉప-వర్గీకరణపై విచారణ చేయడానికి, రాజీవ్ రంజన్ మిశ్రా, ఐ.ఏ.ఎస్., (రిటైర్డ్) నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను నియమించినట్లు ఇంఛార్జి జిల్లా సాంఘీక సంక్షేమ …
Read More »ఖజానా ద్వారా పెన్షన్ల ను పొందే వారు జనవరి 1 వ తేదీ తరువాత లైఫ్ సర్టిఫికెట్ అందజేయాలి
-2025 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 లోగా సమర్పించాల్సి ఉంటుంది -జనవరి ఒకటో తేదీ తదుపరి సమర్పించిన వాటినీ మాత్రమే పరిగణన లోనికి తీసుకోవడం జరుగుతుంది -ఎన్ ఐ సి వెబ్సైట్ “జీవన్ ప్రామాణ్” లో ఆన్లైన్ లో సమర్పించే వెసులుబాటు ఉంది -జిల్లా ఖజానా అధికారి ఎన్. సత్యనారాయణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఉద్యోగము చేసి రిటైర్ అయిన ఫించనుదార్లు మరియు కుటుంబ ఫించనుదార్లు ప్రతి సంవత్సరం సమర్పించవలసిన తమ తమ లైఫ్ సర్టిఫికేట్ ( వార్షిక …
Read More »కొనకళ్ళ నారాయణ రావు, వీరంకి వెంకట గురుమూర్తి లను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా నియమితులైన కొనకళ్ళ నారాయణ రావు ని మరియు ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నియమితులైన వీరంకి వెంకట గురుమూర్తి లను ఆంధ్రప్రదేశ్ విప్, ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మర్యాదపూర్వకంగా కలిసారు. మంగళవారం విజయవాడ కార్యాలయంలో కొనకళ్ళ నారాయణరావు, గురుమూర్తిలను కలసి దుశ్సాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కష్టపడేవారికి సముచిత స్థానం కల్పించారని అన్నారు. పార్టీ …
Read More »ఆదిత్యా మల్టీస్పెషాలిటీ డెంటల్ క్లీనిక్ ఉచిత దంత వైద్య శిబిరానికి విశేష స్పందన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదిత్యా మల్టీస్పెషాలిటీ డెంటల్ క్లీనిక్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు రోడ్డులోని సీతారంపురంలో ఉన్న ఆసుపత్రిలో మంగళవారం నిర్వహించిన ఉచిత దంత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. లయన్స్ క్లబ్ గవర్నర్ శంకర్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదిత్యా మల్టీస్పెషాలిటీ డెంటల్ క్లీనిక్ అధినేతలు డాక్టర్ బలుసా రాజీవ్, డాక్టర్ ప్రశాంతి లక్ష్మీ దేవి మాట్లాడుతూ… గడచిన 25 సంవత్సరాలుగా ప్రాక్టీస్ అనుభవం ఉందన్నారు. ఏడాది …
Read More »విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి ప్రతిపాదనలకు నీతి ఆయోగ్ నుంచి ఆమోదం ఇప్పించాలి
-కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ఎంపి కేశినేని శివనాథ్ విజ్ఞప్తి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : అమృత భారత్ స్టేషన్ పథకం కింద విజయవాడ రైల్వే స్టేషన్ ను పునరాభివృద్ధి చేసేందుకు సి.ఆర్.బి (Chairman, Railway Board) రూ 819.51 కోట్లు అంచనా వ్యయంతో నీతి ఆయోగ్ కి పంపించిన ప్రతిపాదనలు త్వరగా ఆమోదం పొందే విధంగా కృషి చేయాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ , కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విజ్ఞప్తి చేశారు. …
Read More »
Prajavartha Online Telugu News