రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (సిటిఆర్ఐ భవిష్యత్తులో NIRCA) రాజమండ్రి మరియు గ్రామీణ ఫౌండేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ న్యూఢిల్లీ వారి Grow project లో భాగంగా 10 డిసెంబర్ 2024న మహిళా సాధికారత దిశగా 5000 మంది మహిళలను ఔత్సాహిక పారిశ్రామికులుగా తీర్చిదిద్దే దిశగా అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సమావేశానికి ముఖ్య అధ్యక్షులుగా సిటిఆర్ఐ డైరెక్టర్ డా. మాగంటి శేషు మాధవ్ వ్యవహరించగా, గ్రామీణ ఫౌండేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ శత్రుప కాశ్యప్ విచ్చేశారు. మూడు సంవత్సరాల పాటు కుదుర్చుకున్న ఈ ఒప్పందంతో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించిన వివిధ మండలాలలోని గ్రామాలలోని స్వయం సహాయక బృందాలకు నైపుణ్య శిక్షణను కల్పించడం, దీర్ఘకాలిక శిక్షణలు, సందర్శన మరియు ప్రదర్శనలు వంటి అంశాలపై వారికి అవగాహన కల్పించడంతోపాటు మంచి ట్రైనర్గా తీర్చిదిద్దడంపై శిక్షణలను కల్పించడం జరుగుతుందని డా. మాగంటి శేషు మాధవ్ గారు వివరించారు. ఈ ఒప్పందంలో సిటిఆర్ఐ శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రం, కలవచర్ల హెడ్ డా. వి ఎస్ జి ఆర్ నాయుడు మరియు సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్టులు, గ్రామీణ ఫౌండేషన్ అధికారులు సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికను రూపుదిద్దుకొని ఉభయ జిల్లాలలోని స్వయం సహాయక బృందాల మహిళలకు స్వయం ఉపాధి అవకాశం కల్పించే దిశగా నైపుణ్య శిక్షణలను అందించడం జరుగుతుందని గ్రామీణ ఫౌండేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి శత్రుపా కాశ్యప్ వివరించారు. ఈ దిశగా అవగాహన ఒప్పందంపై సి టి ఆర్ ఐ డైరెక్టర్ డా. మాగంటి శేషు మాధవ్ మరియు గ్రామీణ ఫౌండేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి శత్రుపా కాశ్యప్ సంతకాలు చేశారు. ఈ సమావేశానికి సిటిఆర్ఐ శాస్త్రవేత్తలు డా ఎల్.కె. ప్రసాద్, డా. హెచ్. రవిశంకర్, డా. బి. హేమ, కృషి విజ్ఞాన కేంద్రం హెడ్ డా. వి ఎస్ జి ఆర్ నాయుడు, జెవిఆర్ సత్యవాణి, గ్రామీణ ఫౌండేషన్ అధికారులు శ్రీమతి పీ లక్ష్మి, ఎం ఆనంద్ నాయక్, కే అరవింద్ కుమార్, శ్రీమతి ఆసియా సయ్యద్, డేవిడ్ ద్రోనాడ్, తదితరులు పాల్గొనగా, సిటిఆర్ఐ సిబ్బంది ఈ. ప్రశాంత్ వర్మ, టి. పరమేశం తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News