Breaking News

ఎక్సైజ్ కమిషనర్ నిషాత్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఎక్సైజ్) రాహుల్ దేవ్ శర్మ ఆకస్మిక తనిఖీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పన్ను రహిత మద్యం రవాణాను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని రాష్ట్ర అబ్కారీ శాఖ కమీషనర్ నిషాత్ కుమార్ స్పష్టం చేశారు. నిబంధనల మేరకు అధిక ధరలకు మద్యం విక్రయించకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్ నిషాత్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఎక్సైజ్) రాహుల్ దేవ్ శర్మ గరికపాడు అబ్కారీ చెక్-పోస్ట్‌లో మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పర్యటనలో భాగంగా చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించి వాటి పనితీరును తెలుసుకున్నారు. అనంతరం జగ్గయ్యపేటలోని ఎక్సైజ్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్‌లో నిర్వహిస్తున్న క్రైం రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. ఎన్టీఆర్ జిల్లా గండేపల్లిలో ఉన్న సెంటినీ డిస్టిలరీని కూడా అధికారులు తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా అధికారుల బృందం ఇండియన్ మేడ్ లిక్కర్ తయారీలో ఉపయోగించే విభిన్న రకాల రసాయనాలను ధృవీకరించారు . అదనపు న్యూట్రల్ ఆల్కహాల్, బాట్లింగ్ ప్రక్రియతో సహా సంబంధిత విధానాలపై కూడా దృష్టి సారించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *