Breaking News

“మానవ హక్కుల” పై న్యాయ విజ్ఞాన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు, ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్ లతో కలిసి మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా స్థానిక దానవాయిపేట లోని ఐ.సి.డి.ఎస్ ఆఫీసు నందు “మానవ హక్కుల” పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రకాష్ బాబు మాట్లాడుతూ ఎవ్వరికీ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం నిరాకరించబడరాదని అన్నారు. హక్కులు లేని మనిషి బానిసతో సమానం అన్నారు . ఎందుకంటే మానవుడు స్వతంత్రంగా జీవించి, తన మనుగడ కాపాడుకోవడానికి హక్కులు ఊతమిస్తాయి. ప్రతి ఒక్కరూ ఎలాంటి వివక్షకు గురికాకుండా సమాన హక్కులతో జీవించాలని అన్నరు. ఎవరికి ఎలాంటి న్యాయ సమస్యలు, సందేహాలు ఉన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని అన్నారు.

ఈ సదస్సులో రాజమహేంద్రవరం ఆర్.డి.ఓ. ఆర్ కృష్ణ నాయక్ మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు కల్పించడం అధికారులు బాధ్యతాయుతమైన పాత్రను పోషించాల్సి ఉంటుందన్నారు.

అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కేసుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రకాష్ బాబు మాట్లాడుతూ హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కేసుల్లో బాధితులకు పరిహారం అందించే విషయంలో గౌరవ సుప్రీం కోర్టు వారి ఆదేశాలను అనుసరించాలని అన్నారు. డిశంబరు 14 న జరగబోవు జాతీయ లోక్ అదాలత్ నందు పరిష్కార యోగ్యమున్న వీలైనన్ని ఎక్కువ కేసుల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలియచేసారు.

ఈ కార్యక్రమంలోఐ.సి.డి.ఎస్ పి.డి. కె. విజయ కుమారి,  సి.డి.పి.ఒ నర్సమ్మ , అంగన్వాడీ టీచర్స్, ఆషా వర్కర్స్, ఎ.ఎన్.ఎమ్ లు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లో ని ఆర్.డి.ఒ లు, రంపచోడవం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, రాజమహేంద్రవరం ట్రాఫిక్ డి.ఎస్.పి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *