Breaking News

షెడ్యూల్డ్ కులాలలోని ఉప-వర్గీకరణపై విచారణ చేయడానికి కమిటి ఏర్పాటు

-మొమోరాండం/ రిప్రజంటేషన్స్ లను అందజేసేందుకు చివరి తేదీ జనవరి 9
-ఎమ్ సందీప్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం (పంజాబ్ రాష్ట్రం & ఇతరులు Vs దేవిందర్ సింగ్ & ఇతరులు (సివిల్ అప్పీల్ నం. 2317 ఆఫ్ 2011), తేదీ: 01.08.2024 న వెలువరించిన తీర్పు ననుసరించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలలోని ఉప-వర్గీకరణపై విచారణ చేయడానికి, రాజీవ్ రంజన్ మిశ్రా, ఐ.ఏ.ఎస్., (రిటైర్డ్) నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను నియమించినట్లు ఇంఛార్జి జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి ఎమ్ సందీప్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

. సదరు ఏకసభ్య కమిషన్ కార్యాలయము గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయ మొదటి అంతస్తు, కోనేరు లక్ష్మయ్య వీధి, మొఘల్రాజపురం, విజయవాడ 520010, ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ నందు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై ఏదైనా సంతకంతో కూడిన వ్రాతపూర్వక మొమోరాండం/ రిప్రజంటేషన్స్ లను, కార్యాలయపు పని వేళలందు ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రము 5 గంటల 30 నిమిషముల వరకు వ్యక్తిగతంగా, లేదా తిరుగు రసీదుతో కూడిన రిజిస్టరు పోస్టు ద్వారా తెలియ చేసేందుకు అవకాశం ఉందన్నారు. లేదా ఇమెయిల్ ఐడి : omcscsubclassificaton@gmail.com ద్వారా గడువు తేదీ:09.01.2025 వరకు సమర్పించవచ్చునని సందీప్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *