విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదిత్యా మల్టీస్పెషాలిటీ డెంటల్ క్లీనిక్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు రోడ్డులోని సీతారంపురంలో ఉన్న ఆసుపత్రిలో మంగళవారం నిర్వహించిన ఉచిత దంత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. లయన్స్ క్లబ్ గవర్నర్ శంకర్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదిత్యా మల్టీస్పెషాలిటీ డెంటల్ క్లీనిక్ అధినేతలు డాక్టర్ బలుసా రాజీవ్, డాక్టర్ ప్రశాంతి లక్ష్మీ దేవి మాట్లాడుతూ… గడచిన 25 సంవత్సరాలుగా ప్రాక్టీస్ అనుభవం ఉందన్నారు. ఏడాది క్రితం ప్రారంభించిన ఆదిత్యా మల్టీస్పెషాలిటీ డెంటల్ క్లీనిక్ తరఫున అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు నాణ్యతాప్రమాణాలు పాటిస్తూ అందిస్తున్న కారణంగా ప్రజల నుంచి ఆదరాభిమానాలు పొందామని తెలిపారు. ఇప్పటివరకు తాము 250 ఉచిత దంత వైద్య శిబిరాలు నిర్వహించినట్లు చెప్పారు. అదేవిధంగా ఈహెచ్ఎస్ సేవలు 1,500 మందికి అందజేశామని పేర్కొన్నారు. ఆసుపత్రి మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులతో సహా ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ఈహెచ్ఎస్ సేవలు అందిస్తామని, అలాగే జర్నలిస్ట్ హెల్త్ కార్డుపై జర్నలిస్టులకు కూడా సేవలందిస్తామని తెలిపారు. మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 13వ తేదీ వరకు జరిగే ఉచిత దంత వైద్య శిబిరంలో 10 శాతం రాయితీతో కూడిన దంత వైద్య సేవలందిస్తామని చెప్పారు. సీనియర్ లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ లో కీలక వ్యక్తి, నగర ప్రముఖులు కె .వి.జగన్ మోహన్ రావు మా తండ్రి అన్ని విధాలా వెన్నుదన్నుగా వుండి ప్రోత్సహించారన్నారు. నగర వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ బలుసా రాజీవ్, డాక్టర్ ప్రశాంతి లక్ష్మీ దేవి కోరారు.
Prajavartha Online Telugu News