-రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా టూరిజం కాన్ క్లేవ్ లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడి -27 జనవరి, 2025 న విశాఖ నోవాటెల్ హోటల్ లో ఉదయం 10 గం.లకు టూరిజం కాన్ క్లేవ్ నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల ఇన్వెస్టర్లు హాజరుకావాలని పిలుపునిచ్చిన మంత్రి దుర్గేష్ -ఫిబ్రవరిలో తిరుపతిలో మరో టూరిజం కాన్ క్లేవ్ నిర్వహిస్తామని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్ -అమరావతి రాజధానిలో రివర్ ఫ్రంట్ ను పర్యాటక అభివృద్ధికి కేటాయించేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి …
Read More »Daily Archives: January 26, 2025
ఏపీ హైకోర్టులో ఘనంగా గణతంత్య్ర దినోత్సవ వేడుకలు
-రాజ్యాంగం స్పూర్తికి విఘాతం కలుగకుండా న్యాయ వ్యవస్థ గార్డియన్ పనిచేస్తున్నది -రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అవరణలో 76 వ భారత గణతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం సభికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలుకు ఎటు వంటి విఘాతం కలుగకుండా …
Read More »రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి:సిఎస్ విజయానంద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలోని ప్రతి ఒక్కరూ మన రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని అప్పుడే రాజ్యాంగ నిర్మాతల కలలు సాకారం అవుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పేర్కొన్నారు.76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని జాతిపిత మహాత్మా గాంధి,రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించిన పిదప మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్క రించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద …
Read More »అసెంబ్లీ సమావేశాలు ఏడాదిలో 75 రోజులైనా జరగాలి:శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలపై లోతైన చర్చ జరగాలంటే అసెంబ్లీ సమావేశాలు ఏడాదిలో కనీసం 75 రోజుల పాటు జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు.76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర అసెంబ్లీ భవనం వద్ద ఆదివారం జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన తదుపరి మువన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ ముందుగా గతణంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.1950 …
Read More »సంక్షేమ ఫలాలు అందరికీ అందాలి అప్పుడే సమాజంలోని అసమానతలు తొలగుతాయి
-రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల సంక్షేమానికి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పధకాలు ప్రతి పేదవానికి అందినప్పుడే సమాజంలోని అసమానతలు పూర్తిగా తొలగుతాయని రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు అన్నారు.76వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ భవనం ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూష్పాంజలి ఘటించి ఘనంగా …
Read More »ప్రభుత్వం గీత వృత్తిదారులకు కేటాయించిన 10% రిజర్వేషన్ మద్యం షాపుల విషయంలో గౌడ కులస్తులకు అన్యాయం!
-జై గౌడ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మోర్ల ఏడుకొండలు గౌడ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం గీత వృత్తిదారులకు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్ మద్యం షాపుల విషయంలో గౌడ కులస్తులకు అన్యాయం జరిగిందని జై గౌడ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మోర్ల ఏడుకొండలు గౌడ్ అన్నారు. ఆదివారం గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో మోర్ల ఏడుకొండలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం జీవో.ఎంఎస్.నెం.210, 211, 212, 213 గీత వృత్తిదారులకు మద్యం షాపుల రిజర్వేషన్‌లో 10 శాతం కల్పించే …
Read More »భారత రాజ్యాంగం ప్రతిఒక్కరికీ మార్గదర్శకం
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ రాజ్యాంగం ప్రతిఒక్కరికీ మార్గదర్శకమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా సత్యనారాయణపురం గాయత్రీ కళ్యాణ మండపం వద్ద ఆదివారం ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అత్యున్నతమైనదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. రాజ్యాంగం పౌరులకు హక్కులతో పాటు బాధ్యతలను …
Read More »ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను నాశనం చేశారు
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎక్కడ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావటంలేదని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు భిన్న ఆలోచనలతో పాలన సాగిస్తూ.. కూటమి నేతలు రాష్ట్రాన్ని తిరోగమనం దిశగా తీసుకువెళ్తున్నారని మల్లాది విష్ణు విమర్శించారు. ముఖ్యంగా దావోస్ వేదికగా అంతర్జాతీయంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను సర్వనాశనం చేశారని ఆరోపించారు. పబ్లిసిటీ కోసం విపరీతంగా ఖర్చు చేసి …
Read More »విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఎట్ హోం కార్యక్రమాన్ని రాజ్ భవన్ లో నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులతో పాటు, న్యాయమూర్తులు, రాష్ట్ర మంత్రులు, ఎంఎల్ఏలు , అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు , ప్రముఖులు ఎట్ హోం కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నర్ స్వయంగా ఆహ్వానితుల ను ఆత్మీయంగా పలకరించారు. 76 వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా విజయవాడ లోని గవర్నర్ నివాసమైన రాజ్ భవన్ లో ఎట్ హోం …
Read More »