-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ రాజ్యాంగం ప్రతిఒక్కరికీ మార్గదర్శకమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా సత్యనారాయణపురం గాయత్రీ కళ్యాణ మండపం వద్ద ఆదివారం ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అత్యున్నతమైనదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. రాజ్యాంగం పౌరులకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా కల్పించిందని పేర్కొన్నారు. ప్రజలైనా, పాలకులైనా, అధికారులైనా రాజ్యాంగబద్దంగా వారి పాత్రలను నిర్వర్తించాలని.. అప్పుడే అందుకు తగిన గౌరవం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగంలోని విలువల కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని.. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఎందరో పోరాటయోధుల ఆత్మార్పణ ఫలమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. అటువంటి మహనీయుల త్యాగాలను స్మరించుకుని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, నాయకులు డా.ఈశ్వర్, దోనెపూడి శ్రీనివాస్, చాంద్ శర్మ, సనత్, చల్లా సుధాకర్, కూనపులి ఫణి, ఓగిరాల రాజశేఖర్, సీతారామ్, లంకా కుమార్, చంద్రశేఖర్, వెంకటేశ్వరరెడ్డి, దుర్గారావు, లక్ష్మి రాఘవేంద్రరావు, పులపా కృష్ణ, కురిటి శివ, నందెపు సురేష్, వెంకట్రావు, పసుపులేటి యేసు, అంజి బాబు, తాటి శివ, కిరణ్ కుమార్, ప్రేమ్ కుమార్, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News