నేటి పత్రిక ప్రజావార్త :
Read More »Daily Archives: March 13, 2025
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 4వ SIPB సమావేశం
-రూ.1,21,659 కోట్లు పెట్టుబడులకు ఆమోదం -10 కొత్త ప్రాజెక్టుల ద్వారా 80,104 మందికి ఉద్యోగాలు -వివిధ సంస్థల పెట్టుబడులు, ప్రాజెక్టుల పురోగతిపై ట్రాకింగ్ -175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు… ముందుగా 26 జిల్లాల్లో ఏర్పాటు -నెల రోజుల్లో రాష్ట్రంలో ఐదు చోట్ల 5 రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలు -ఎస్ఐపిబి సమావేశంలో అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వెంటనే గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. …
Read More »2019-24 మధ్య విద్యుత్ రంగానికి చీకటి రోజులు
-గత ప్రభుత్వం విధ్వంసం చేసిన విద్యుత్ రంగాన్ని 9 నెలల్లో గాడిన పెట్టాం -ఇంధన రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధిస్తాం. ఇప్పటి వరకు రూ.5.19 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు -సోలార్ విద్యుత్ ఉత్పత్తితో ప్రతి ఒక్కరూ ఆదాయం పొందే విధానాన్ని తీసుకొస్తాం -యూనిట్ విద్యుత్ కొనుగోలు ధర రూ.5.16 నుంచి రూ.4.80కి తగ్గించేందుకు ప్రయత్న -1998లో తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలో ఆ రంగాన్ని నిలబెట్టాయి -ప్రతి నియోజకవర్గంలో 10 వేల రూఫ్‌టాప్‌ల ఏర్పాటు…పీఎం కుసుమ్ కింద 4 లక్షల పంపుసెట్ల …
Read More »పీఎం సూర్యఘర్ పథకంలో బీసీలకు అదనపు రాయితీపై సీఎం చంద్రబాబు ప్రకటన
-సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు రూ.20 వేల అదనపు సబ్సీడీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు కేంద్రం ఇచ్చే రాయితీకి అదనంగా రూ.20 వేలు సబ్సిడీ రూపంలో అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రకటించారు. 2 కిలో వాట్ల సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుకు రూ.1.20 లక్షలు వరకు ఖర్చవుతుండగా కేంద్ర ప్రభుత్వం రూ.60 వేలు రాయితీగా అందిస్తుంది. అయితే బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మరో రూ.20 …
Read More »ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన డీఆర్‌డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి
-రాష్ట్రంలో రక్షణ రంగంలో పెట్టుబడులకు విస్తారంగా అవకాశాలు -ముఖ్యమంత్రికి సతీష్ రెడ్డి ప్రజెంటేషన్ -ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నరని వెల్లడి -పెట్టుబడిదారులకు స్వాగతం పలుకుతామన్న చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పెద్దఎత్తున పరిశ్రమలు స్థాపించేలా కృషి చేస్తున్న డీఆర్‌డీవో మాజీ చైర్మన్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ జి సతీష్ రెడ్డి గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పారిశ్రామిక అభివృద్ధికి …
Read More »అగ్నివీర్ సిబ్బంది నియామకాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, గుంటూరు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు చెందిన అభ్యర్థుల కోసం అగ్నివీర్ సిబ్బంది నియామకాలు 2025-26 నమోదును ప్రారంభించింది. వివిధ కేటగిరీల అగ్నివీర్ల నియామకం కోసం www.joinindianarmy.nic.in ద్వారా నమోదు చేసుకోవచ్చు. నమోదుకు చివరి తేదీ 10 ఏప్రిల్ 2025. ఒక అభ్యర్థి ఇప్పుడు రెండు వేర్వేరు అగ్నివీర్ కేటగిరీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈఈ) మొట్టమొదటిసారిగా తెలుగుతో సహా 13 వేర్వేరు భాషల్లో నిర్వహించబడుతోంది. అన్ని కేటగిరీలకు సంబంధించిన …
Read More »తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర వేసిన మొల్ల
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సాహిత్యంలో కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ(మొల్ల) చెరగని ముద్ర వేశారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. తెలుగు సాహిత్యంలో ఆమె రచనలకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. గురువారం మొల్ల జయంతి సందర్బంగా రాష్ట్ర సచివాలయంలో ఆమె చిత్రపటానికి మంత్రి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, సామాన్య కుమ్మరి కుటుంబంలో జన్మించిన …
Read More »జియంసికి ఆస్తి పన్ను చెల్లించని మొండి బకాయిదారుల 6 వ్యాపార సంస్థలను సీజ్ చేసిన జియంసి
-నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఏ.యస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థకు బకాయిదారులందరకు పన్ను చెల్లింపునకు ఎటువంటి గడువు లేదని, ఆస్తి పన్ను పై వడ్డీ రాయితీ కూడా లేదని నగర పాలక సంస్థ బకాయిదారుల ఆస్తుల సీజ్ కు నగర పాలక సంస్థ ఉపక్రమించిందని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ గారు ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు. ఈ సందర్భంగా కమీషనర్ గారు మాట్లాడుతూ, నగర పాలక సంస్థకు బకాయిలు చెల్లించని 278 నివాసాలు మరియు …
Read More »అన్నా క్యాంటీన్లలో మెనూ కచ్చితంగా అమలయ్యేలా చర్యలు
– నిర్వహణపరంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతర పర్యవేక్షణ – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లలో మెనూ కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవడం జరిగిందని.. అదే విధంగా నిర్వహణపరంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతర పర్యవేక్షణ ఉంటోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టర్ లక్ష్మీశ గురువారం రాత్రి విజయవాడ అర్బన్, వన్‌టౌన్ గాంధీ మహిళా కళాశాల వద్ద అన్నా …
Read More »పటిష్ట ప్రణాళికతో రబీ ధాన్యం సేకరణకు సిద్ధంకండి
– రైతు ప్రయోజనాలే లక్ష్యంగా కార్యాచరణ ఉండాలి – సరైన ప్రణాళిక, పటిష్ట సమన్వయం, నిరంతర పర్యవేక్షణ ముఖ్యం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి విజయవంతంగా ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తయిందని.. ఇదే విధంగా రబీ (2024-25) సీజన్ ధాన్యం కొనుగోలుకు పటిష్ట ప్రణాళికతో సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. గురువారం పౌర సరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ, …
Read More »