-అమరావతికి స్పోర్ట్స్ యూనివర్శిటీ కి 142 ఎకరాలు కేటాయింపు : ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి రాజధాని ప్రాంతంలో 220 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్శిటీ రాబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమరావతి స్పోర్ట్స్ యూనివర్శిటీ కోసం 142 ఎకరాల కేటాయింపు చేశారని, స్పోర్ట్స్ సిటీలోనే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం కాబోతుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ లోని సిద్ధార్థ నగర్ లో ది పికిల్ బాల్ రిపబ్లిక్ పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన పికిల్ బాల్ కోర్ట్ లను శుక్రవారం ఎంపి కేశినేని శివనాథ్ , ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం కాసేపు కోర్ట్ లో సరదాగా ఇద్దరు పికిల్ బాల్ గేమ్ ఆడారు. ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మీడియా తో మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంతంలో స్పోర్ట్స్ అకాడమీలు రావాలి. గతంలో హైదరాబాద్ లో ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఏప్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించటం వల్ల మౌలిక సదుపాయాలు కల్పించటం జరిగింది. అందువల్ల ఎన్నో స్పోర్ట్స్ అకాడమీ వచ్చాయి..పుల్లెల గోపిచంద్ అకాడమీ కూడా సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో వచ్చిందన్నారు. ఈ అకాడమీలు రావటం వల్ల హైదరాబాద్ లో ఔత్సాహిక క్రీడాకారులు వారి నైపుణ్యాన్ని మెరుగుపర్చుకుని రాణించారు. అదే విధంగా రాష్ట్రంలో క్రీడా సదుపాయాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాబోయే కాలంలో అమరావతి లో ఏర్పాటు చేసే స్పోర్ట్స్ సిటీలో ఇలాంటి అకాడమీలు అందులో చోటు ఇవ్వనున్నట్లు తెలిపారు. క్రీడాలకు సంబంధించిన అకాడమీలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టిగా కృషి చేస్తున్నారని చెప్పారు. స్పోర్ట్స్ యూనివర్శిటీ అంటే క్రీడాకారుల నైపుణ్యాన్ని మెరుగుపర్చటమే కాదు…స్పోర్ట్స్ కి సంబందించిన సపోర్టింగ్ స్టాప్, ఫిజియోధెరఫిస్టులు, కోచ్ లకు ట్రైనింగ్ ఇచ్చే విధంగా వుండబోతుందన్నారు. అలాగే పికిల్ బాల్ కోర్ట్ ఏర్పాటు నిర్వహకులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ది తోపాటు క్రీడాభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారన్నారు. ఆర్యోగానికి క్రీడలకు చాలా అవసరమని,నేటి యువతకి క్రీడలపట్ల బాగా ఆసక్తి పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పికిల్ బాల్ కోర్ట్ నిర్వహకులు డాక్టర్ వడ్లమూడి స్రవంతి, ప్రియ, ప్రశాంతి, టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లాహ్, కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News