విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి కోరారు. ఈ విషయమై సోమవారం విజయవాడ ధర్నాచౌక్ లో గిరిజనులు నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం సాయుధ గిరిజన రైతుల పోరాటం తర్వాత దేశ వ్యాప్తంగా ఆదివాసీలకు ఐటీడీఏలు వచ్చాయని.. కానీ శ్రీకాకుళం జిల్లాకు రాకపోవడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వంలో జిల్లా విభజన సమ యంలో ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని వాపోయారు. …
Read More »Daily Archives: March 17, 2025
ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలి…
-పిఆర్సి చైర్మన్ ని వెంటనే నియమించాలి. -పెండింగ్ లో ఉన్న డిఏలు మంజూరు చేయాలి. -జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా ఎ. విద్యాసాగర్ ఏకగ్రీవ ఎంపిక. విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గత ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వల్ల ప్రస్తుత ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఏపీ ఎన్జీజీవో సంఘం ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే.వి. శివారెడ్డి అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలు తదితర …
Read More »డాక్టర్ మాకాల సత్యనారాయణ కు ఎఫ్ టామ్ ఎక్స్లెన్స్ అవార్డు ప్రధానం
విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర( ఎఫ్ టామ్ ) విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రమునందు 16 మార్చ్ 2025 న జరిగిన వారధి కార్యక్రమమునందు డాక్టర్ మాకాల సత్యనారాయణ యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ కు ఎఫ్ టామ్ ఎక్స్లెన్స్ అవార్డు ను సినీ యాక్టర్ సుమన్ తల్వార్ మరియు ఎఫ్ టామ్ అధ్యక్షుడు గజ్జల జగన్ బాబు చేతులు మీదగ అందించారు.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, మహారాష్ట్రలో నివసిస్తున్న తెలుగువారి సాంస్కృతిక,కమ్యూనిటీ మరియు వ్యాపార …
Read More »ప్రతి నియోజవర్గానికీ విజన్ డాక్యుమెంట్
-ఎమ్మెల్యే చైర్మన్‌గా అభివృద్ధి ప్రణాళికల అమలు -స్పెషల్ ఆఫీసర్‌గా జిల్లా స్థాయి అధికారి నియామకం -పైలట్ ప్రాజెక్టుగా 4 నియోజకవర్గాలకు విజన్ సిద్ధం… త్వరలో మిగిలిన వాటికి రూపకల్పన -శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్ -త్రిభాషా సూత్రంపై రాద్ధాంతం వద్దని హితవు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర విజన్ – 2047 సాధనలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, వాటిని అమలు చేసి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేలు సంకల్పం తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పైలెట్ …
Read More »BJMC రాష్ట్ర అధ్యక్షుడిగా షేక్ ఖలీఫా తుల్లా బాషా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా షేక్ ఖలీఫా తుల్లా బాషా డిల్లీ లోని భారతీయ జనతా మాజ్దూర్ సెల్ జాతీయకార్యాలయంలో భారతీయ జనతా మాజ్దూర్ సెల్ జాతీయ చైర్మన్ బిశ్వ ప్రియా రాయ్ చౌదరి మరియు భారతీయ జనతా మాజ్దూర్ సెల్ అధ్యక్షుడు అర్నాబ్ ఛటర్జీ సమక్షంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమం లో యన్.ప్రశాంత్.కుమార్ జాతీయ కార్యదర్శి, సహా ప్రముఖ జాతీయ నాయకులు పాల్గొన్నారు. ఈసందర్బంగా కొత్త అధ్యక్షుడిగా పదవి …
Read More »సీఎం చంద్రబాబును కలిసిన ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్
-ఏఐ సాయంతో గుండె జబ్బులు నిర్ధారించే సిర్కాడియావీ యాప్‌ను రూపొందించిన 14 ఏళ్ల సిద్ధార్థ్ -సచివాలయానికి ఆహ్వానించి అభినందించిన సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబును ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల అనే బాలుడు కలిశాడు. ఏడు సెకెన్లలోనే గుండె జబ్బులు నిర్ధారించేందుకు ఏఐ సాయంతో సిర్కాడియావీ యాప్‌ను సిద్ధార్థ్ ఇటీవల రూపొందించారు. స్మార్ట్‌ఫోన్ ద్వారా గుంటూరు జీజీహెచ్‌లో రోగులకు పరీక్షలు కూడా నిర్వహించారు. విషయం తెలుసుకున్న సీఎం సిద్ధార్థ్‌ను కలిసేందుకు ఆహ్వానించారు. సిద్ధార్థ్ ప్రొఫైల్ తెలుసుకుని అభినందించారు. దాదాపు …
Read More »గత ప్రభుత్వం హయాంలో అసంపూర్తిగా పిహెచ్ సిల నిర్మాణాలు
-ఆర్భాటంగా నాడు-నేడు కార్యక్రమాన్ని చేపట్టారే తప్ప ప్రయోజనం శూన్యం -కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించనందున నిలిచిపోయిన పిహెచ్సిల నిర్మాణాలు -గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్ని నిర్మిస్తున్నాం -అసెంబ్లీలో వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం కొత్త పిహెచ్ సిలను నిర్మిస్తామంటూ ఆర్భాటంగా చేపట్టిన నాడు -నేడు కార్యక్రమం అసంపూర్తిగానే మిగిలిపోయిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కొత్త పిహెచ్సిల నిర్మాణంపై శాసనసభలో సభ్యులడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు …
Read More »అధికారులు సమగ్రంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న ఆర్జీలను భాధ్యతగా అధికారులు సమగ్రంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా …
Read More »గుంటూరు నగర సమగ్రాభివృద్ధికి దోహదపడేలా స్టాండింగ్ కమిటి నిర్ణయాలు
-రూ.1534 కోట్ల అంచనాలతో 2025-26 వార్షిక బడ్జెట్ కి ఆమోదం -స్టాండింగ్ కమిటి సమావేశానికి అధ్యక్షత వహించిన కమిటి సభ్యులు కొమ్మినేని కోటేశ్వరరావు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వార్డ్ ల వారీగా సమగ్రాభివృద్ధికి దోహదపడేలా, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా షుమారు 361 పనులకు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటి ఆమోదం తెలిపిందని స్టాండింగ్ కమిటి సమావేశానికి అధ్యక్షత వహించిన కొమ్మినేని కోటేశ్వరరావు తెలిపారు. సోమవారం స్టాండింగ్ కమిటి సమావేశం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగర …
Read More »అధికారులకు, యాజమాన్యాలకు తగు ఆదేశాలు జారీ…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మిర్చి తొడెమెలు తీసే గోడౌన్ ల వ్యర్ధాల వలన ప్రజలు మిర్చికోరుతో ఇబ్బందులు పడుతున్నారని పలు ఫిర్యాదులు అందుతున్నాయని, నిర్వహకులు తగు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవి, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి చుట్టగుంట సెంటర్ నుండి మిర్చి యార్డ్ వరకు పర్యటించి, మిర్చి తొడెమెల గూడౌన్ …
Read More »