Breaking News

అన్న క్యాంటీన్లో ఆహార నాణ్యతను స్వయంగా తానే పరిశీలించిన

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్న క్యాంటీన్లో ఆహార నాణ్యతను స్వయంగా తానే పరిశీలించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా గులాబీ తోటలో ఉన్న అన్న క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్యూలైన్లో  టోకెన్ తీసుకుని, టిఫిన్ లో  ఆహార నాణ్యతను పరిశీలించారు. అన్న క్యాంటీన్లో ఆహారం తీసుకుంటున్న ప్రజలతో కలిసి టిఫిన్ చేస్తూ,  అక్కడున్న వసతులు బాగున్నాయా, టోకెన్లు అందరికీ అందుతున్నాయా, సరైన సమయానికి అన్న క్యాంటీన్ తెలుస్తున్నారా, పరిశుభ్రత ఎలా ఉంది వంటి విషయాలు  అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో కమిషనర్ తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ శుభం నొకవల్, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *