-జెసి లోతోటి శివశంకర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రతీ మండలంలో కోవిడ్ టెస్ట్ నమూనా సేకరణ, ఫీవర్ సర్వే సాఫీగా జరిగేందుకు 26 మంది క్లస్టర్డ్ నోడల్ ఆఫీసర్లను నియమించినట్లు జాయింట్ కలెక్టరు (అభివృద్ధి) లో తోటి శివశంకర్ చెప్పారు. స్థానిక జెసి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సంబంధిత క్లస్టర్ నోడల్ ఆఫీసర్లు, వైద్యాధికారులతో ఫీవర్ సర్వే, కోవిడ్ టెస్ట్ నిర్వాహణ పై జెసి శివశంకర్ సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ 3వ దశను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ రోగలక్షణాలు, పాజిటివ్ కేసులను ముందుగా గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో క్రమంతప్పకుండా పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రతీరోజూ కనీసం 8 వేల కోవిడ్ టెస్టు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం జిల్లాలోని ప్రతి మండలం, ప్రతీ ప్రైమరి హెల్త్ క్లినిక్ లేదా గవర్నమెంట్ ఫెసిలిటీకి పర్యవేక్షణాధికారులను నియమించడం జరిగిందన్నారు. కరోనా నిబంధనలను ప్రతీ ఒక్కరూ పాటించేలా ముఖ్యంగా గ్రామాల్లో ప్రతీ సోమ, మంగళ, బుధవారాల్లో ప్రభుత్వం నిర్దేశించిన మేరకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈసమావేశంలో జిల్లా వైద్య శాఖాధికారిణి డా. యం. సుహాసిని, డిసి హెచ్ యస్ డా. జ్యోతిర్మయి, అదనపు డియం హెచ్ఓలు డా. జె. ఉషారాణి, డా. ఆషా, డిఐఓ డా. షర్మిష్ట, డా. వైయస్ఆర్ అర్బన్ క్లినిక్స్ నోడల్ ఆఫీసర్ డా. మోతీబాబు, యన్ క్యుఏయస్ అధికారి డా. చైతన్య, తదితర వైద్యాధికారులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …