విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజిన్లో అంతర్గత రోడ్లు, మంచినీటి సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేసే బాధ్యత వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వనిది అని,అందుకు తగ్గ కార్యాచరణ రూపొందించి నిధులు మంజూరు చెపిస్తున్నాం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం 3 వ డివిజన్ గంగిరెద్దుల దిబ్బ,వైస్సార్ కాలనీ నందు స్థానిక కార్పొరేటర్ బిమిశెట్టి ప్రవల్లిక, నాయకులతో కలిసి పర్యటించిన అవినాష్ ఇంటి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నాడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో దేవినేని నెహ్రూ ఎమ్మెల్యే గా వున్నప్పుడు కాలనీగా ఏర్పడితే వారు రోడ్లు, ఇతర సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేశారు అని, కానీ వైస్సార్సీపీ కి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న కారణంతో గత టీడీపీ ప్రభుత్వం లో నిర్లక్ష్యానికి గురై అభివృద్ధికి నోచుకోలేదు అని తెలిపారు.ఇప్పుడు వైస్సార్సీపీ ప్రభుత్వం లో ఈ డివిజన్ కి దాదాపు కోటిన్నర రూపాయల నిధులు మంజూరు చేపించి రోడ్లు, సైడ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణలు చేపట్టడం జరిగిందని అన్నారు.మా ప్రభుత్వం మీద నమ్మకంతో మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో 1500 ఓట్ల మెజార్టీతో గెలిపించారని,వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని భరోసా ఇచ్చారు.అదేవిధంగా కులమత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి దే అని,వీలైనంత త్వరగా ఈ ప్రాంతంలో అధికారులతో మాట్లాడి డ్రైన్ సమస్యలు ,మంచి నీటి పైప్ లైన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ముసునూరు సుబ్బారావు,బాబు, నాని, డేవిడ్ రాజు, సాయి, అనిల్, గోల్డ్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …