ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక‌కు 70 అర్జీలు

– ప్ర‌తి అర్జీపైనా ప్ర‌త్యేకంగా దృష్టిపెట్టి ప‌రిష్క‌రించాలి
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) కార్య‌క్ర‌మం స్థానిక క‌లెక్ట‌రేట్  పింగ‌ళి వెంక‌య్య సమావేశ మందిరంలో నిర్వహించారు. అర్జీలను స్వీకరించిన అనంతరం కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో నమోదయ్యే అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం ద్వారా అందిన అర్జీలకు నిర్దేశ గ‌డువులోగా తగిన పరిష్కారాలు చూపాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూకు 25, ఎంఏయూడీకి 13, పోలీస్ 6, విద్య 5, పంచాయ‌తీరాజ్ 4, డీఆర్‌డీఏకు 3 అర్జీలురాగా ఏపీసీపీడీసీఎల్‌, మైన్స్ అండ్ జియాల‌జీ, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా విభాగాల‌కు రెండు చొప్పున అర్జీలు వ‌చ్చాయి. ఆరోగ్యం, వ్య‌వ‌సాయం, గృహ నిర్మాణం, పొల్యూష‌న్‌, ఉపాధి క‌ల్ప‌న‌, స‌ర్వే అండ్ సెటిల్‌మెంట్‌, ప‌శు సంవ‌ర్థ‌క, పారిశ్రామిక శాఖ‌ల‌కు ఒక్కో అర్జీ వ‌చ్చాయి. కార్య‌క్ర‌మంలో జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, డీఆర్‌వో ఎం.లక్ష్మీ న‌ర‌సింహం, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాస‌రావు, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి పి.జ్యోతి, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *