ఈ నెల 31న ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల పంపిణీకి ప‌టిష్ట ఏర్పాట్లు

– జిల్లాలో 2,30,619 పెన్ష‌న్ల‌కు రూ. 98.19 కోట్లు విడుద‌ల
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఒక రోజు ముందే ఈ నెల 31వ తేదీ మంగ‌ళ‌వారం 100 శాతం పెన్ష‌న్ల పంపిణీకి అధికారులు, సిబ్బంది కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. సోమ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. డీఆర్‌డీఏ పీడీ, ఆర్‌డీవోలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపీడీవోలతో ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల పంపిణీపై క‌లెక్ట‌రేట్ నుంచి టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. పెన్ష‌న్ల పంపిణీ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసేలా దిశానిర్దేశం చేశారు. ఏవైనా చిన్న‌చిన్న స‌మ‌స్య‌లుంటే వెంట‌నే సరిదిద్ది ఉద‌యం ఆరు గంట‌ల నుంచే పెన్ష‌న్ల పంపిణీని ప్రారంభించాల‌ని.. జిల్లాలో 2,30,619 పెన్ష‌న్ల‌కు రూ. 98.19 కోట్లు విడుద‌ల చేసిన‌ట్లు వెల్ల‌డించారు. టెలీకాన్ఫ‌రెన్స్‌లో విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర హెచ్ఎం, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాస‌రావు, విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య‌, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, నందిగామ ఆర్‌డీవో కె.బాల‌కృష్ణ‌, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపీడీవోలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *