-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ఖాళీ స్థలలలో పార్కులు అభివృద్ధి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నగరంలో ఉన్న అన్ని పార్కులో ఉన్న మరమతులన్నీ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా APIIC కాలనీ, ఆచార్య రంగా రోడ్, గురునానక్ కాలనీ, హై టెన్షన్ రోడ్, ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ పర్యటించ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ఖాళీ స్థలాల్లో పార్కులను అభివృద్ధి చేయాలని అధికారులతో అన్నారు. ఆచార్య రంగా నగర్ లో రోడ్డు పాడైపోవడం గమనించి త్వరితగతిన రోడ్డును మరమ్మతులు చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని సూపరింటెండెంటింగ్ ఇంజనీర్ వర్క్స్ పి.సత్యనారాయణ ను ఆదేశించారు. గురు నానక్ కాలనీ ప్రాంతంలో పర్యటించినప్పుడు డివైడర్ల మధ్య గ్రీన్ ఎక్కువగా లేకపోవడం గమనించి గ్రీనురి పెంచి, కాలుష్యాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్ ని ఆదేశించారు. నగరంలో హరితహారాన్ని మరింత పెంచి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణంలో కల్పించాలని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి హై టెన్షన్ రోడ్ పర్యటించారు, రోడ్డు విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలను త్వరిత గతిన తీసుకోవాలని చీఫ్ సిటీ ప్లానర్ జీ వి జి ఎస్ వి ప్రసాద్ ను ఆదేశించారు. తదుపరి ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల పరిశీలించారు. గర్భిష్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో సరైన ఎగ్జిట్ , మరియు షెడ్యూల్ పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూపర్ అండి ఇంజనీర్ ప్రాజెక్ట్స్ పి సత్య కుమారి ని ఆదేశించారు. మానడు రోడ్డు వద్ద గల డ్రైన్ లను త్వరితగతిన నిర్మాణం చేపట్టాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం ని ఆదేశించారు.