-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు, కూరగాయల మార్కెట్ లాంటి ప్రదేశాలలో కూరగాయల వ్యర్ధాలు జనావాసముండే ప్రదేశాలలో ప్రజలు వేసే వ్యర్ధాలు ఎక్కువగా లోడర్ బిన్స్లో వేయడం వలన, చెత్త సేకరణ నిత్యం జరుగుతున్నప్పటికీ ఎక్కువ శాతం లో వ్యర్ధాలు ఉండటం వలన అటువంటి ప్రదేశాలలో అనారోగ్యకరమైన వాతావరణం కలుగుతున్న తరుణంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర వినూత్నంగా ఆలోచించి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు అటువంటి ప్రదేశాలలో లోడర్ బీన్స్ ను గార్బేజ్ లోడర్ పాయింట్లకు ఒక ప్రత్యేకమైన ఖాళీ స్థలంలో బహిరంగంగా కనపడకుండా ఉండేందుకు షెడ్డు లాంటి నిర్మాణం ఏర్పాటు చేసి ఆ లోడర్ బిన్లను ఆ షెడ్డు లోపల తరలించేటట్టు చర్యలు తీసుకున్నారు.
మంగళవారం ఉదయం కమిషనర్ సాంబమూర్తి రోడ్లో ఏర్పాటు చేసిన గార్బేజి వాటర్ పాయింట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంబమూర్తి రోడ్లో ఒకవైపు రైతు బజార్ మరోవైపు ఇతర వ్యర్ధాలు ఎక్కువగా వేసే ప్రదేశం కాబట్టి ప్రయోగాత్మకంగా ఈ సర్కిల్లో గార్బేజ్ లోడర్ పాయింట్ గా గుర్తించి ఒక ఖాళీ స్థలంలో బహిరంగంగా వ్యర్ధాలు వేసే లోడర్ బిన్స్ కనిపించకుండా షెడ్డు లోపల లోడర్ బీన్స్ ని ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేటట్టుగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. షెడ్డు లోపల లోడర్ బిల్స్ ని పెట్టడం వలన బహిరంగంగా వ్యర్ధాలు ఉండవని, చెత వాహనం వచ్చినప్పుడు లోడర్ బిన్ లో నుంచి అభ్యర్థులను ఎప్పటికప్పుడు తొలగించి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ఒక ప్రయోగాత్మకమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. వీటి కార్యచరణ సక్రమంగా ఉన్నచో ప్రతి సర్కిల్లో ఇటువంటి గార్బేజ్ లోడర్ పాయింట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తదుపరి ఎక్సెల్ ప్లాంట్ పర్యటించి ఆవుల కోసం నిర్మాణం చేసిన కాటిల్ షెడ్ ను పరిశీలించారు, రోడ్లపైన ఆకులు ఉండకుండా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఆవులు బహిరంగంగా కనపడినచో వాటిని కాటన్ షర్ట్ కి తీసుకువచ్చి యజమానులకు భారీ జరిమానా విధించేటట్టు చర్యలు తీసుకోవాలని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి రెడ్డిని తెలిపారు. తదుపరి హుక్ లోడర్ వెహికల్ పనితీరును పరిశీలించారు, రానున్న రోజుల్లో వ్యర్ధాల సేకరణ మరియు రవాణా పటిష్టంగా జరిగేందుకు ఆవాహనాన్ని త్వరతగతిన వాడేటట్టు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ (MRF) సెంటర్ ను పరిశీలించి ప్రతిరోజు పొడి చెత్తను వేరే చేసే పని కచ్చితంగా జరిగేటట్టు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో వ్యర్ధాలు తీసుకొచ్చే డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను పరిశీలించారు. స్వచ్చ సర్వేక్షన్ లో భాగంగా వాటి నిర్వహణ కూడా సరిగ్గా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి. చంద్రశేఖర్, సూపరిండెంటింగ్ ఇంజనీర్ (ప్రాజెక్ట్స్) పి సత్యకుమారి, మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఇంచార్జ్ వెహికల్ డిపో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏసు పాదం, ఇతర సానిటరీ మరియు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News