విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోడానికి ఉన్న ఏకైక మార్గం చదువేనని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కుమారుడు గద్దె క్రాంతికుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్‌కు చెందిన సిరిపురపు రంజిత్ పిల్లల స్కూల్ ఫీజు నిమిత్తం రూ.20 వేలు, 14వ డివిజన్‌కు చెందిన బత్తుల చిలకయ్య పిల్లల స్కూల్ ఫీజు నిమిత్తం రూ.20 వేలను గద్దె క్రాంతి కుమార్ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుని కార్యాలయంలో స్వయంగా వారికి అందచేశారు.
ఈ సందర్భంగా గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకోవడం ద్వారా మంచి ఉద్యోగం పొందవచ్చునని తద్వారా కుటుంబం ఉన్నత స్థితికి చేరుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మొదటి నుంచి చదువుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. చదువు ద్వారానే జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చునని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని ప్రతిభ గల విద్యార్థులు ఆర్థిక పరమైన ఇబ్బందుల కారణంగా చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తన సొంత నిధులతో ఆర్థిక సహాయం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందచేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని గద్దె క్రాంతి కుమార్ చెప్పారు. ఇప్పుడు సహాయం పొందిన విద్యార్థులు జీవితంలో స్థిరపడిన తర్వాత మరికొంత మందికి సహాయం చేయాలని గద్దె క్రాంతికుమార్ చెప్పారు.
ఈ కార్యక్రమములో గద్దె రమేష్, కొండేటి వెంకట్రావు, తెంటు రాజేష్, తుమ్మల వెంకట్, ఎం.నితిన్, తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు నగరంలో సింగిల్ యూస్ …