కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నం జిల్లాకు చెంది హౌసింగ్ నిర్మాణ కార్యక్రమం కు ఇసుక సరఫరా చేసేందుకు కుమారదేవరం రిచ్ ను కేటాయించడం జరిగిందనీ, క్షేత్ర స్థాయిలో సరఫరా విధానం పరిశీలించినట్లు జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. ఇసుక రవాణా వ్యవస్థ మరింత మెరుగ్గా నిర్వహించాలని బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యులకు జెసి సూచించారు. త్వరలో మరో 16 ఒపెన్ రిచెస్ ద్వారా 77 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుందని, అందుకు అనుగుణంగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ వెంట జిల్లా మైన్స్ అండ్ జువలిజికల్ అధికారి డి .ఫణి భూషణ్ రెడ్డి, కొవ్వూరు తహసిల్దార్ దుర్గా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Tags kovvuru
Check Also
సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు నగరంలో సింగిల్ యూస్ …