విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు నగరంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ బాన్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ బాబు శ్రీనివాస్ అన్నారు. సర్కిల్ 3 పరిధిలోని పబ్లిక్ హెల్త్ సెక్షన్ అధికారులందరూ, సర్కిల్ 3 కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏఎమ్ఓహెచ్ 3 బాబు శ్రీనివాస్ మాట్లాడుతూ శానిటరీ వర్కర్ల అటెండెన్స్, చెత్త తరలించే వాహనాలకు సంబంధించి ట్రిప్ లు మరియు వెయిటేజ్, చెత్త ఎక్కువగా పడే బ్లాక్ స్పాట్ లను గుర్తించి క్లీనింగ్, లిఫ్టింగ్, డిసైన్ఫెక్షన్ చేయడం మరియు వాటిని నివారించడానికి తీసుకోవలసిన చర్యలు, సింగల్ యూజ్డ్ ప్లాస్టిక్ నియంత్రణ మరియు అపరాధ రుసుముల వివరములు, ట్రేడ్ లైసెన్సులు, యాంటి లార్వల్ యాక్టివిటీస్ మరియు స్వచ్ఛ సర్వేక్షన్ 2024 కు సంబంధించిన విషయముల మీద చర్చించడం జరిగినది.
ఈ కార్యక్రమం లో శానిటరీ సూపర్వైజర్లు అయిన షేక్ సలీం, సోమరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మలేరియా ఇన్స్పెక్టర్లు, వార్డు శానిటేషన్ మరియు ఎన్విరాన్మెంట్ కార్యదర్శిలు అందరూ పాల్గొనటం జరిగింది.