విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.10.01.2025 శుక్రవారం విజయవాడ లోని “ఏ.పీ.ఎస్.ఎస్.డి.సి[APSSDC] ఎన్టీఆర్ డిస్టిక్ ఆఫీస్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, రమేష్ హాస్పిటల్స్ ఎదురుగా, ప్రభుత్వ ITI రోడ్, విజయవాడ, విజయవాడ తూర్పు నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా నందు ” కంపెనీ స్పెసిఫిక్ స్పెసిఫిక్ డ్రైవ్ [Company-Specific Drive]” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు(FAC), ఒకేషనల్ ఉపాధి కల్పన అధికారి వై. సత్యబ్రహ్మం మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు సంయుక్తంగా తెలియజేసారు.
ఈ కంపెనీ స్పెసిఫిక్ డ్రైవ్ [Company-Specific Drive] లో, Thesis ఎంటర్ప్రైజెస్ వంటి ప్రముఖ కంపెనీ వారు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కంపెనీలో గల ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ, ఐటిఐ, పాలిటెక్నిక్, బీఎస్సీ మరియు బీటెక్ [ఫుడ్ టెక్నాలజీ] పూర్తిచేసిన 24 నుండి 30 సంవత్సరాల లోపు వారు అర్హులని, ఎంపిక అయిన వారికి సంవత్సరానికి సుమారు రూ.1,80,000/- నుండి రూ.3,00,000/- ల వరకు వేతనముతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, జనవరి 10 న నిర్వహించబోయే ఈ కంపెనీ స్పెసిఫిక్ డ్రైవ్ [Company-Specific Drive] కు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు APSSDC సంస్థ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు తెలిపారు.
ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://tinyurl.com/jobmela-naipunyam లింక్ నందు తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ అయ్యి, సదరు జాబ్ మేళాకు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్ మరియు సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని, మరిన్ని వివరాలకు 9347779032 నెంబర్ ను సంప్రదించాలని తెలిపారు.