ముఖ్యమంత్రి కి సాదర వీడ్కోలు

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త :
తన సొంత నియోజక వర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో మూడు రోజులపాటు పర్యటనను విజయవంతం గా ముగించుకొని బుధవారం మధ్యాహ్నం ద్రావిడ యూనివర్సిటీ ఇందిరాగాంధీ స్టేడియం లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుండి మ .1.15 గం.తిరుగు ప్రయాణమైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి సాదర వీడ్కోలు పలికారు అధికారులు,ప్రజా ప్రతినిధులు.

తన పర్యటనలో కుప్పం నియోజక వర్గం దిశా దిశ మార్చే విధంగా స్వర్ణ కుప్పం విజన్ 2029 ను లాంఛనంగా ప్రారంభించి ఐదు సంవత్సరాలలో చేపట్టబోయే పనులకు సంబంధించి వివిధ వర్గాల ప్రజలకు సవివరంగా వివరించి… ఇందులో ప్రారంభంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు గావించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

వీడ్కోలు పలికిన వారిలో ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, అనంతపురం రేంజ్ డీఐజీ హిమోషి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు,జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి,మదన పల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష,కడ పిడి వికాస్ మర్మత్,ట్రైనీ కలెక్టర్ హిమ వంశీ టీటీడీ పాలకమండలి సభ్యులు శాంతరాం, పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *