-పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించాలనే ప్రభుత్వ ఉన్నత ఆశయానికి అనుగుణంగా వైద్య సేవలు అందించాలి :జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రుయా ఆసుపత్రిలో మెరుగైన పలు సౌకర్యాల ఏర్పాటుకు కమిటీ ఆమోదిస్తూ, పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించాలనే ప్రభుత్వ ఉన్నత ఆశయానికి అనుగుణంగా వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులను, సిబ్బందిని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు ఆదేశించారు. బుధవారం స్థానిక ఎస్వీ వైద్య కళాశాల పాలన భవనం కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ హోదాలో అధ్యక్షత వహించి సంబంధిత కమిటీ సభ్యులతో సమీక్షలో పాల్గొని రుయా ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశాన్ని నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో SVRR ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ సమావేశంలో శ్రీ మతి ఎన్. మౌర్య, మునిసిపల్ కమీషనర్, డా.పి.ఎ. చంద్రశేఖరన్, ఎస్.వి. మెడికల్ కళాశాలపిన్సిపాల్, శ్రీ ఎం. శివరామి రెడ్డి, ఎ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డా॥ వి.బాలకృష్ణ నాయక్, తిరుపతి జిల్లా ఆరోగ్య & వైద్యాధికారి, డా॥ ఎస్. ఆనంద మూర్తి, జిల్లా డి.సి.హెచ్.ఎస్. మరియు రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా॥ జి రవి ప్రభు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు వారి సిబ్బంది, ఇంజనీర్లు మరియు ఇతర అధికారులు సమన్వయంతో పనిచేసి ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.
ఈ సందర్భంగా రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ రవి ప్రభు మెంబర్ కన్వీనర్ హోదాలో ముందుగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై తీసుకున్న చర్యలను కమిటీకి వివరించారు. అనంతరం అజెండా అంశాలపై కమిటీకి నివేదించారు. కమిటీలో మునుపటి HDS సమావేశం (18-10-2024) నాడు తీసుకొన్న తీర్మానాల స్థితిని తిరిగి సమీక్ష నిర్వహించగా మునుపటి సమావేశములో చర్చించిన విషయాలు దాదాపు పూర్తిగా అయ్యాయని తెలుపగా మిగిలిన వాటిని త్వరగా పూర్తి చేయవలసినదిగా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా నేటి బుధవారం సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు…డైట్ కాంటీన్ వద్ద పారిశుధ్య పైప్ లైన్స్ రిపైర్స్ మరియు ఇతర మరమ్మతులు కోసం రూ. 2.5౦ లక్షలు కేటాయించుటకు ఆమోదము తెలపడమైనది. గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ నందు భవన మరియు ఇతర మరమ్మతులు కోసం రూ. 7.5౦ లక్షలు కేటాయించుటకు ఆమోదము తెలపడమైనది. అలాగే TBC మరియు DST లాబరేటరీలో మరియు ఇతర మరమ్మతులు కోసం రూ. 9.5౦ లక్షలు కేటాయించుటకు ఆమోదము తెలపడమైనది. అవసరం మేరకు కార్యాలయము నందు పనిచేయు సిబ్బందికి కంప్యూటర్స్ మరియు UPS కొనుగోలు చేయుటకు ఆమోదము తెలిపారు. పిడియాట్రిక్ సర్జరీ OT నందు అనస్తీషియా వర్క్ స్టేషన్ కొనుటకు రూ. 1.35 లక్షలు కేటాయించుటకు కమిటీ ఆమోదించింది.
ICU మంచాలు- 10 కొనుటకు ఆమోదము తెలుపడమైనది.హెచ్.డి.యస్ చైర్మన్ గారు HDS కమిటీ కొరకు ఇద్దరు సభ్యులను ఎన్నుకోవడము జరిగినది. ఈ కార్యక్రమంలో పలు విభాగాల వైద్య అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.