ఈనెల 20వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఇంటింటా కుష్టు వ్యాధి సర్వే కార్యక్రమం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 20వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఇంటింటా కుష్టు వ్యాధి సర్వే చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, మరియు జిల్లా కుష్టు ఎయిడ్స్ మరియు టీవీ అధికారి డాక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని వైద్యాధికారులందరికీ ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ .బాలకృష్ణ నాయక్, ప్రారంభించారు . జిల్లాలోని ఆశ, మగ వాలంటీర్లు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి చర్మం మీద స్పర్శ లేని మచ్చలు ఉన్నట్లయితే వాటిని గుర్తించి వారి వివరాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న వైద్యాధికారి దగ్గర పరీక్ష చేయించి వాటికి సంబంధించిన చికిత్సను అందించాలన్నారు. దీనికోసం వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేయాలని ఈ వ్యాధి చికిత్స. కారణాలు నివారణ చర్యలను ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం కుష్టు వ్యాధి లక్షణాలు, చికిత్స విధానం మొదలగునవి వైద్య అధికారులకు వివరించారు. అనంతరం జిల్లా కుష్టు ఎయిడ్స్ మరియు టీపీ అధికారి డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మచ్చలను అశ్రద్ధ చేయకుండా శరీరంలో పూర్తిగా పరీక్ష చేయాలన్నారు. ఇందుకోసమే ఆడవాళ్లను ఆశ వర్కర్లు మగవాళ్ళను మేల్ వాలంటీర్లు పరీక్ష చేస్తారన్నారు. అనంతరం డామియ ఎన్ ఫౌండేషన్ ఇండియా ట్రస్ట్ జోనల్ కోఆర్డినేటర్ సతీష్  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కుష్టు వ్యాధి గురించి వైద్యాధికారులకు ఆయన వివరించారు. ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ డిఎంహెచ్వోలు డాక్టర్ మృదుల వాణి, డాక్టర్ హరిత, డాక్టర్. మురళి కృష్ణ లెప్రసీ వార్డు వైద్యాధికారి డాక్టర్ మధుబాబు, డాక్టర్ . రాజా, డిపిమోఓ (NHM), డాక్టర్ . శ్రీనివాస రావు డిస్ట్రిక్ట్ న్యూక్లిస్ టీం , డాక్టర్ ఎస్వీ రమణ, ఫిజియోథెరపిస్ట్, డిపిఎమ్ఓ. తిరు జ్ఞానం, డిప్యూటీ డెమో. కిరణ్ కుమార్, ఎస్ .ఓ. నాగేంద్ర కుమార్, మరియు జిల్లాలోని వైద్యాధికారులు, నోడల్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రి పై భోగి పండ్లు కార్యక్రమం

ఇంద్రకీలాద్రి,  నేటి పత్రిక ప్రజావార్త : భోగి సందర్బంగా సోమ‌వారం దేవస్థానం మహమండపం 7 వ అంతస్తు నందు పెద్ద …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *