-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎండాకాలంలో త్రాగునీటి సరఫరా లో ప్రజలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా త్రాగునీటిని సరఫరా చేసేటట్టు ప్రణాళికలను సిద్ధం చేస్తూ దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా దుర్గా ఘాట్, గాంధీ మున్సిపల్ హై స్కూల్, బందర్ రోడ్, ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాబోవు ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి సరఫరా లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని, అందుకు అధికారులందరూ ముఖ్యంగా స్థానిక కార్పొరేటర్లు, ఏమినిటీల తో మాట్లాడి ఆ ప్రాంతం కి తగ్గట్టు ప్రణాళికను సిద్ధం చేయాలని అన్నారు.
గాంధీ మున్సిపల్ హై స్కూల్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ పరిశీలించారు. అన్నా క్యాంటీన్లను నోడల్ ఆఫీసర్లు అందరూ ప్రతి రోజు నిత్యం పర్యవేక్షిస్తూ ఎటువంటి అసౌకర్యం పారిశుధ్య నిర్వహణలో లోపం లేకుండా చూసుకోవాలి అన్నారు. అన్న క్యాంటీన్లో మరుగుదొడ్ల నిర్వహణ త్రాగునీటి మరియు వాడుక నీటి సరఫరా లో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని అన్నారు. దుర్గ ఘాట్ వద్ద ఉన్న టాయిలెట్లను పరిశీలించి, ఆ ప్రదేశంలో నిత్యం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి గాంధీజి మున్సిపల్ హై స్కూల్ వాటర్ ట్యాంక్ వద్ద పబ్లిక్ టాయిలెట్లను పరిశీలించారు నిత్యం నగరంలో ఉన్న పబ్లిక్ టాయిలెట్లను అధికారులు పర్యవేక్షిస్తూ పరిశుభ్రంగా ఉంచుతూ నిరంతర పర్యవేక్షణలో ఎటువంటి మరమ్మతులు లేకుండా చూసుకోవాలని అన్నారు. నగరంలో ఉన్న రోడ్లలో పాట్ హోల్స్ వద్ద వేసే ప్యాచ్ వర్క్ లలో నాణ్యత ప్రమాణాలతో వేయాలని రోడ్డుతో సరి సమానంగా ఉండేటట్టు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి, సానిటరీ సూపర్వైజర్లు, సెక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు