కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలు లబ్ధిదారులకు సమర్థవంతంగా చేర్చాలి

-ప్రభుత్వ పథకాలు లక్ష్య సాధన లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం అవసరం.
-ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి
-20 పాయింట్ చైర్ పర్సన్ లంకా దినకర్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకి చేర్చడంలో అధికారులు వారధి గా విధులు బాధ్యతలు నిర్వహించాలని దిశ కమిటీ ఛైర్మన్, రాజమండ్రీ పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు.

గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశమందిరంలో దిశ (జిల్లా అభివృద్ధి కోఆర్డినేషన్ మరియు మానిటరింగ్ కమిటీ) సమావేశం జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధ్యక్ష్యతన జరిగింది.

ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ ఎం. పి. దగ్గుబాటి పురందేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, 20 పాయింట్స్ చైర్మన్ లంక దినకర్, కలెక్టర్ పి. ప్రశాంతి, శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు,మున్సిపల్ కమీషనర్ కేతన్ గార్గ్, జిల్లా అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంజి ఎన్ఆర్ఈజిఎస్, జల్ జీవన్ మిషన్, పిఎం గ్రామ సడక్ యోజన, పిఎంఏవై, టిడ్కో, అమృత్,ఎస్ హెచ్ జి లఖపతి డిడీస్ & డ్రోన్‌లు,పీఎం విశ్వకర్మ, పీఎం స్వానిధి, పీఎం సూర్య గర్, వ్యవసాయం, జాతీయ గోకుల్ మిషన్, పర్యాటకం, పారిశ్రామిక పార్కులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్,ఎస్టీ సంక్షేమం వంటి పథకాలు అమలు పురోగతిపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎంపి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సమర్థవంతంగా అమలు చేయడంలో లోపాలను గుర్తించడం సమీక్షించడం జరిగిందన్నారు. వాటిని అధిగమించి కేంద్ర ప్రభుత్వం అమలు నిధులను 100 ప్రజలకు వాటి ప్రయోజనాలను చేర్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులకు పథకాలు యొక్క ప్రయోజనాలు పొందుతున్నది  లేనిది అన్న అంశంపై శాఖలవారీగా సమీక్షించడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల పై సూచనలు సలహాలు తీసుకొని కేంద్రానికి నివేదించడం జరుగుతుందన్నారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేస్తుందన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి దిశ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధుల నుంచి కూడా తగు సమాచారాన్ని తీసుకోవడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న 37 కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ కాలంలో కేంద్ర ప్రభుత్వ నిధులను మార్గదర్శకాలు మేరకు వినియోగించని కారణంగా పథకాల పనుల పురోగతి అసంతృప్తిగా ఉన్నాయన్నారు. ఇందులో భాగంగా జల జీవన మిషన్, ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ వినియోగం వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. నేటి సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాలఅమలు పురోగతిపై ఒక అంచనాకు రావడం జరిగిందని రానున్న రోజుల్లో సుదీర్ఘ సమీక్ష చేయడం జరుగుతుందన్నారు.  నూతన హెచ్ఎంపివీ వైరస్ ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ వైరస్ పై  ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారని పేర్కొన్నారు.

రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ, రాష్ట్రాలకి నిర్దేశించిన లక్ష్యాలను ఏ విధంగా అమలు జరుగుతున్నాయో సమీక్షించడం జరిగిందని తెలిపారు. వాటిలో లోపాలు అధిగమించి , మెరుగైన సూచనలకు వేదిక గా ఈ సమావేశం నిర్వహించామన్నారు. గత ఐదేళ్ళ కాలంలో జలజీవన్ మిషన్, అమృత్ వంటి పథకాలు నిర్జీవనం అవ్వడం చూసామన్నారు. అయితే ఇది ఏ ఒక్కరినీ విమర్శించే విధానం కాదని, గతంలో సమర్థవంతంగా చేస్తే, ప్రజలకు ఎంతో మేలు చేకూరేదని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా పనితీరు చూపాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జలజీవన్ మిషన్, అమృత పథకాలు ద్వారా మంచినీటి అవసరాలు పూర్తి స్థాయిలో  నిర్వహించలేదన్నారు. గత ఐదేళ్లలో ఏ విదమైన లక్ష్యలను పూర్తి చెయ్యలేదన్నారు.

గ్రామాలలో సీసీ రోడ్లు నిర్మాణం పనులను చేపట్టడం జరిగిందని, అయితే ప్రజలు డ్రెయినేజీ కోసం డిమాండ్ చేస్తున్నారని, వాటికీ సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉంటుందని, ఇందుకు కనీసంగా రూ.10 లక్షల మేర ఖర్చు చెయ్యాల్సి ఉంటుందన్నారు. ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యతా ఇవ్వాలని మంత్రి కందుల దుర్గేష్ కోరారు.

20 పాయింట్ ప్రోగ్రాం చైర్ పర్సన్ లంకా దినకర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అమలు తీరుపై సమీక్షిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి పనిచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, డబుల్ ఇంజన్ గ్రోత్ లక్ష్యాలు పూర్తి చెయ్యడం మన ముందన్న బాధ్యత అన్నారు. వాటిని ఆచరణ సాధ్యం చేసే విధానం పై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు.

గతంలో 26 వేల కోట్ల తో పూర్తి చేయాల్సి ఉన్న 70 వేల కోట్ల ను ఖర్చు చెయ్యాల్సి వచ్చిందన్నారు. పిఎం అవాస యోజన,  టిడ్కో గృహాల్లో మౌలిక సదుపాయలు కల్పించాలన్నారు. గృహ నిర్మాణాల కొరకు  ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టాల్సిన పనుల నిధులను మల్లించి   రైతు భరోసా కేంద్రాల నిర్మాణాల్లో వినియోగించడం జరిగిందన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు మేరకు మాత్రమే నిధులు వినియోగింంచాలన్నారు.
రానున్న రోజుల్లో చేపట్టవలసిన కార్యక్రమాలు ప్రజా ప్రతినిధులు సమక్షంలో వారి దృష్టికి తీసుకుని వెళ్లడం జరగాలని కోరారు. మరోసారి జిల్లాలో పర్యటించి శాఖల వారి ప్రగతిపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత్ భారత్ దిశగా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం  స్వర్ణాంధ్ర @ 2047 దిశగా అడుగులు వేస్తుందన్నారు.

జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రానున్న రోజుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ కంపోనెంట్ నిధులు సమర్ధవంతంగా ఖర్చు చేపట్టడం చేస్తానని తెలిపారు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో తొలిదశ పనులు చేపట్టడం జరిగిందను, 60 శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు. మిగిలిన లక్ష్యాలు మార్చి లోగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. ఉపాధిహామీ పథకం కింద రోజు వారీ వేతనం రూ. 254 ఇస్తున్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రణాళిక లో భాగంగా రూ.300 రోజు వారీ వేతనం లక్ష్య సాధనకు అనుగుణంగా పనులు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.  ఆమేరకు పనులు గుర్తించినట్లు తెలిపారు.

వ్యవసాయ శాఖ పై సమీక్షస్తూ జిల్లాలో పీఎం ఫసల్ బీమా యోజన, భూసార పరీక్షల ఫలితాల కార్డు, ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం, కౌలు రైతులా కార్డ్స్, తదితర పథకాల పై వివరించడం జరిగింది.

ప్రథాన మంత్రి సూర్య ఘర్ పథకాన్ని మరింతగా ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకుని వెళ్లడం పై దృష్టి పెట్టాలన్నారు. ఇందుకు విద్యుత్ సంస్థ డి ఆర్ డి ఎ,  మెప్మా సంస్ధ లతో సమన్వయం చేసుకోవాలన్నారు. విద్యుత్ వినియోగం పొదుపు చేయడం ద్వారా గృహ వినియోగదారులకి అదనపు ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ లకి చెంది గ్రామీణాభివృద్ధి ఉన్నత పథకం కింద సబ్సిడి రానున్న దృష్ట్యా, ఆ వర్గాల ద్వారా యూనిట్స్ ఏర్పాటుకు చేయూత నివ్వడం పై దృష్టి పెట్టాలన్నారు.

జిల్లాలో ఎస్ హెచ్ జి గ్రూపు సభ్యులకు ఉన్నతి, దీనదయాల్ అంత్యోదయ యోజన, సీడ్ క్యాపిటల్ స్త్రీ నిధి, దిన్ దయాళ్ ఉపాద్యాయ గ్రామీణ కౌసల్య యోజన, సీడాప్ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల స్కీమ్ కింద 2 లక్షల 36 వేలమందికి రు.101 కోట్ల రూపాయలను అందిస్తున్నామన్నారు.

పీఎం విశ్వ కర్మ కింద అనుమతించిన దరఖాస్తులకు అనుగుణంగా బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని, ఎవరైనా ముందుకు రానీ ఎడల వాటి వివరాలు అందజేయాలన్నారు. దరఖాస్తులు చేసుకున్న వారికీ బ్యాంకర్లు ఋణం తిరస్కరించిన సమయంలో లబ్దిదారుల నుంచి లేఖ తీసుకొని, వాటి ఆధారంగా తిరస్కరించాలని పేర్కొన్నారు. బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం లో దరఖాస్తులు ఫ్రెండ్లీ యూజర్ విధానంలో సరళీకృతం గా ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు.

వైద్య ఆరోగ్య శాఖ పై సమీక్షిస్తూ జననీ సురక్ష, పి ఎం మాతృ వందనం, పి ఎం టీబి విముక్తి భారత్,  ఆరోగ్య శ్రీ తదితర వైద్య సేవలు వివరాలు వివరించడం జరిగింది.

ఈ సమావేశంలో శాసనసభ్యులు  ముప్పిడి వెంకటేశ్వరరావు,మున్సిపల్ కమీషనర్ కేతన్ గార్గ్, జడ్పీ సీఈవో వివిఎస్ లక్ష్మణరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధిలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *