-దరఖాస్తు చేసుకున్న వారి జాబితా వెబ్ సైట్ లో అప్లోడ్ చెయ్యడం జరిగింది
-ఈనెల 16 వ తేదీ సా 5 వరకూ అభ్యతరాల స్వీకరణ
-కలెక్టరు పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా, కలెక్టరు వారి కార్యాలయం నందు ఖాళీగా ఉన్న “ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ ” పోస్టునకు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేయుటకు గాను తేదీ: 22.09.2024 న నోటిఫికేషన్ ద్వారా అభ్యర్ధుల నుండి ధరఖాస్తులను తేదీ:23.09.2024 నుండి 02.10.2024 వరకు స్వీకరించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియచేసారు. అభ్యర్ధుల నుండి స్వీకరించిన ధరఖాస్తుల పరిశీలన తరువాత తాత్కాలిక జాబితా ను రూపొందించి https://eastgodavari.ap.gov.in అను వెబ్ సైటు నందు పొందుపరచబడినట్లు తెలిపారు.
ఈ జాబితా లో ఏమైనా అభ్యంతరములు / ఫిర్యాదులు ఉన్నచో తేదీ 10.01.2025 నుండి 16.01.2025 సాయంత్రం 5 గంటల లోపు కలెక్టరు వారి కార్యాలయం, పరిపాలన అధికారి విభాగము నందు తగిన ఆధారములతో సమర్పించాలని పేర్కొన్నారు. జనవరి 16 వ తేదీ సాయంత్రం 5.00 గంటల తరువాత ఎటువంటి అభ్యంతరములు / ఫిర్యాదులు స్వీకరించబడవు. అభ్యర్థుల నుండి స్వీకరించిన అభ్యంతరములు / ఫిర్యాదులు పరిశీలన తరువాత తుది అర్హుల జాబితా మరియు అనర్హుల జాబితాలు వెబ్ సైటు నందు పొందుపరచబడును.
/ https://eastgodavari.ap.gov.in పొందుపరచిన Grievance Application లో మాత్రమే పూర్తిచేయవలెను, లేని యెడల అటువంటి అభ్యర్ధనలు పరిగణలోనికి తీసుకొనబడవు అని పేర్కొన్నారు.