-19 మంది అధికారులు, సిబ్బంది సమక్షంలో దాడులు
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి
కడియం, నేటి పత్రిక ప్రజావార్త :
బుర్రీలంక ఇసుక రిచ్ పాయింట్ వద్ద అక్రమ మైనింగ్ కు వినియోగిస్తున్న మూడు పొక్లెయిన్ లు సీజ్ చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియచేసారు. కడియం మండలం వేమగిరి సమీపంలోని బుర్రీలంక గోదావరీ పరీవాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా కోసం అక్రమ మైనింగ్ చేస్తున్న నేపథ్యంలో రెవిన్యూ, మైనింగ్, పోలీస్ ,టాస్క్ ఫోర్స్ బృందం అధికారులతో కూడిన 19 మంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రభుత్వము ఉచిత ఇసుక పాలసీ విధానంలో మరింత పారదర్శకంగా , జవాబుదారీతనం కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటున్న, కొందరు అక్రమ తవ్వకాలు జరపడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ విషయంలో విజిలెన్స్ విభాగాన్ని మరింత కట్టుదిట్టం చెయ్యడం జరిగిందని తెలిపారు. ఇదే క్రమంలో అక్రమ ఇసుక త్రవ్వకాలు , రవాణా చెయ్యరాదన్న ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా మారని తీరు క్షేత్ర స్థాయిలో గమనించడం జరిగిందన్నారు. ఇదే క్రమంలో అక్రమ త్రవ్వకాలు జరిపే వాటి విషయంలో ఉపేక్షించే ప్రసక్తి లేదని కలెక్టరు హెచ్చరించారు. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వాహనాలకు సీజ్ చేయనున్నట్లు తెలిపారు. గురువారం నిర్వహించిన దాడుల్లో మొత్తం 19 మంది అధికారులు సిబ్బంది తో కూడిన నాలుగు బృందాలు పాల్గొన్నట్లు తెలిపారు.
అధికారుల సిబ్బంది బృందంలో….
మైన్స్ డిపార్ట్మెంట్ జిల్లా మైన్స్ అధికారి డీ. . ఫణిభూషణరెడ్డి , డి. జ్యోతిర్మయి (ఆర్ ఐ) , పి.శ్రీనివాస్ వారు (సర్వేయర్) , కే. మనీష(టెక్నికల్ అసిస్టెంట్) , రెవిన్యూ డిపార్ట్మెంట్ తరపున డి. సోనియా (ఆర్ ఐ), జి. వెంకట్రావు (వి ఆర్ వో – బుర్రిలంప) , ఎ.అరుణరేఖ, బి . శ్రీను లు (విఆర్వో – వేమగిరి) , ఏ శివరామ కృష్ణ ( పొట్టిలంక – విఆర్వో) , అన్సర్, దివ్య భవానీ, మనోజ్ (వేమగిరి విలేజ్ సర్వేయర్ లు ) , బి. సుబ్రహ్మణ్యం ( పొట్టిలంక – విలేజ్ సర్వేయర్ ) , జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ బృందం ఎ .ప్రసాద్, (ఎస్ ఐ), ఏ గిరిబాబు, (హోమ్ గార్డ్), పోలీసు డిపార్ట్మెంట్ దుర్గాప్రసాద్ (SI) M. సురేష్ కుమార్ (హెడ్ కానిస్టేబుల్) , జి. రాధాకృష్ణ (PC) లు పాల్గొన్నారు.