గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయ కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో భాధ్యతతో విధులు నిర్వహించాలని, రోడ్లు, డ్రైన్ల ఆక్రమణలను తొలి దశలోనే అడ్డుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ గారు కోబాల్ట్ పేట, పట్టాభిపురం, తారకరామ నగర్ ప్రాంతాల్లో పర్యటించి సచివాలయ కార్యదర్శులకు, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు స్థానికంగా ఎదుర్కొనే పారిశుధ్యం, వీధి దీపాలు, త్రాగునీటి సరఫరా సమస్యలపై సచివాలయ కార్యదర్శులు సంయుక్తంగా భాద్యత తీసుకోవాలని, ప్రతి రోజు సచివాలయ పరిధిలో ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా రోడ్లు, డ్రైన్ల ఆక్రమణలను తొలిదశలోనే అడ్డుకోవాలని స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని, పనులను నేరుగా పరిశీలించిన తదుపరే బిల్లుల చెల్లింపుకు ప్రాసెస్ చేస్తామన్నారు. ఇంజినీరింగ్ అధికారులు నూతన రోడ్ల ఏర్పాటు ప్రతిపాదనల్లో తప్పనిసరిగా ఎండ్ టు ఎండ్ రోడ్, డ్రైన్లు, ఉండేలా చూడాలన్నారు. తారకరామ నగర్ రోడ్ విస్తరణ పనులకు ఆర్డిపిని వేగంగా సిద్దం చేయాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు.
పర్యటనలో డిఈఈలు రమేష్ బాబు, శ్రీనివాస్, ఏసిపి రెహ్మాన్, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …