గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో శుక్రవారం జరిగే నారెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్న నేపధ్యంలో హెలిప్యాడ్ నుండి సభా ప్రాంగణం వరకు జిఎంసి నుండి చేపట్టాల్సిన పారిశుధ్య పనులను, రోడ్ల ప్యాచ్ వర్క్ లను పక్కాగా చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రినివాసులు ఐఏఎస్ ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ హెలిప్యాడ్ నుండి సభ జరిగే హనుమయ్య కంపెనీ వరకు అధికారులతో కలిసి పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటనలో జిఎంసి నుండి చేపట్టాల్సిన పారిశుద్యం, ప్యాచ్ వర్క్ లను పూర్తి చేయాలన్నారు. పర్యటన మార్గంలో అనధికార హోర్డింగ్స్ ని తొలగించాలని పట్టణ ప్రణాళికాధికారులకు, డెబ్రిస్ తొలగించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. పర్యటన మార్గంలో విధుల నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించాలని ఆయా విభాగాదిపతులను ఆదేశించారు.
పర్యటనలో ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, సిటి ప్లానర్ రాంబాబు, సిఎంఓహెచ్ డాక్టర్ అమృత, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, ఈఈ కోటేశ్వరరావు, ఏడిహెచ్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …