Breaking News

మంత్రులు గొట్టిపాటి, డోలా ఆధ్వర్యంలో భారీ చేరికలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకాశం జిల్లా మార్కాపురం తెలుగుదేశం పార్టీలోకి భారీగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు చేరారు. మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో మార్కాపురం మున్సిపాలిటీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 13 మంది కౌన్సిలర్లను టీడీపీ కండువా కప్పి మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామిలు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కాపురం మార్కెటింగ్ యార్డ్ ఛైర్మన్, మున్సిపల్ ఛైర్మన్ లు మరో 2000 మందితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు. సీఎం చంద్రబాబు సమర్థవంతమైన పాలన నచ్చి నేడు వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలోకి చేరారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం మూడు నెలల్లోనే వెనుకబడిన జిల్లా గుర్తించేలా చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఒక్కొక్కటీ నెరవేరుస్తూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా ఎక్కువ మొత్తంలో ఒకటో తారీఖు నాటికి వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజలు ఇంత మంచి చేస్తున్నా కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. గతంలో జగన్ మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇచ్చి మోసపోయారని చెప్పారు. క్షేత్ర స్థాయిలో బలమైన కార్యకర్తలను కలిగిన ఏకైక పార్టీ టీడీపీ అని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. అందుకే టీడీపీ పార్టీ కోటి సభ్యత్వాల దిశగా అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నారాయణ రెడ్డి, అశోక్ రెడ్డి, దర్శి ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మీ, యర్రగొండపాలెం ఇంచార్జి ఎరిక్సన్ బాబు, టీడీపీ నాయకులు మన్నే రవీంద్ర పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *