అధికారికంగా ఈ నెల 11 న వడ్డే ఓబన్న జయంతి వేడుకలు

-అన్ని జిల్లా కేంద్రాలతో పాటు గుంటూరు ఏ1 కన్వేన్షన్ హాల్లో రాష్ట్ర స్థాయి వేడుకలు
-బీసీల సంక్షేమానికి, అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యత రాష్ట్ర బి.సి.,ఇ.డబ్ల్యు.ఎస్. సంక్షేమం, చేనేత మరియు టెక్సటైల్స్ శాఖ మంత్రి ఎస్.సవిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటీష్ వలస పాలకుల ఆగడాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొట్ట మొదటి స్వాతంత్ర్య పోరాటం జరిపిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఈ నెల 11 న రాష్ట్ర స్థాయిలోనూ మరియు అన్ని జిల్లా కేంద్రాల్లోను అధికార పూర్వకంగా జరుపుతున్నట్లు రాష్ట్ర బి.సి., ఇ.డబ్ల్యు.ఎస్. సంక్షేమం, చేనేత మరియు టెక్సటైల్స్ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల ఆత్మగౌరవానికి పెద్ద పీట వేస్తూ విశ్మకర్మ, వాల్మీకి మరియు కనకదాస జయంతులను ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఇదే విధంగా మరో బీసీ ముద్దు బిడ్డ స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఈ నెల 11 న గుంటూరు నగరంలోని ఏ1 కన్వెన్షన్ హాల్ లోను మరియు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ఉత్తర్వులను జారీచేయడం జరిగిందన్నారు.

కర్నూల్ జిల్లా రేనాటి ప్రాంతంలో 1807 జనవరి 11 న సంచార జాతికి చెందిన వడ్డెర కులంలో ఓబన్న జన్మించారని, శిస్తులు వసూలు విషయంలో బ్రిటీష్ ఈస్టు ఇండియా కంపెనీ అధికారులకు మరియు రేనాటి పాలెగాళ్లకు మధ్య ప్రారంభమైన ఘర్షణలు క్రమేపీ సాయుధ పోరాటాలుగా మారాయన్నారు. నొస్సం పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరాటం ఇందులో ముఖ్యమైందన్నారు. ఈ పోరాటంలో సైన్యాధ్యక్షుడిగా ఉన్న వడ్డే ఓబన్న వీరోచిత పాత్రను పోషించారని, వడ్డెర్లు, బోయలు మరియు చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని 10 వేల మందితో ఏర్పాటు చేసుకొని బ్రిటీష్ సైన్యంతో వీరోచితంగా పోరాడిన మహోన్నత వ్యక్తి వడ్డే ఓబన్న అని ఆమె అభివర్ణించారు. బ్రిటీష్ పాలకుల దౌర్జన్యానికి వ్యతిరేఖంగా వడ్డే ఓబన్న చేసిన పోరాట పటిమను భవిష్యత్ తరాలవారికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

బీసీల సంక్షేమానికి, అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యత…
బీసీల సంక్షేమానికి, అభివృద్దికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నట్లు ఆమె తెలిపారు. బడుగు, బలహీన వర్గాల రాజకీయ, సామాజిక అభ్యున్నతికి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ తోటు పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు అత్యధిక ప్రాధాన్యత నిస్తూ పథకాలు అమలు చేయడం జరుగుచున్నదన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు బడ్జెట్లో రూ.39,007 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు 60 వేల మందికి లబ్దిచేకూర్చే విధంగా EWS కార్పొరేషన్లకు రూ.10,273.80 కోట్లు కేటాయించామన్నారు. బీసీ హాస్టళ్ల విద్యార్థుల డైట్ బిల్లుల కోసం బడ్జెట్ లో కేటాయించిన దానికంటే అదనంగా రూ.45.52 కోట్లు ఇవ్వబోతున్నామన్నారు. బడ్జెట్ లో డైట్ ఛార్జీలకై రూ.135 కోట్లు కేటాయించగా, ఇప్పుడు అదనంగా రూ.45.52 కోట్లు ఇవ్వనున్నామన్నారు. కాస్మోటిక్ ఛార్జీలకు బడ్జెట్ లో రూ.11 కోట్లు కేటాయించగా, అదనంగా మరో రూ.21.60 కోట్లు మంజూరు చేశామన్నారు. ట్యూటర్ల పారితోషకానికి బడ్జెట్ లో కోటి రూపాయలు కేటాయించగా, ఇప్పుడు రూ.3.20 కోట్లు అదనంగా చెల్లిస్తున్నామన్నారు. గతంలో నిర్మాణం ప్రారంభించి 80 శాతం పనులతో అసంపూర్తిగా నిలిచిపోయిన 5 బీసీ రెసిడెన్షియల్ పాఠశాల భవనాల నిర్మాణానికి రూ.85 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అమరావతిలో 5 ఎకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ నిర్మించబోతున్నామని, బీసీ అభ్యర్థుల కోసం ఇటీవల విజయవాడలో ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ ప్రారంభించామన్నారు. ఈ సెంటర్ లో 110 మంది అభ్యర్థులకు ఉచిత వసతితో కూడిన సివిల్స్ శిక్షణ అందిస్తున్నామన్నారు. 26 జిల్లాల్లో ఉచిత డీఎస్సీ కోచింగ్ ద్వారా 6 వేల మందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. త్వరలో ఆన్ లైన్ శిక్షణా తరగతులు కూడా ప్రారంభించబోతున్నామన్నారు. ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్పులకు రూ.31.51 కోట్లు, పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్పులకు రూ.222.97 కోట్లు కేటాయించామన్నారు. ఇటీవల 104 బీసీ హాస్టళ్లలో ఎస్సార్ శంకరన్ రిసోర్సు సెంటర్లు ఏర్పాటుచేశామని, ఈ సెంటర్ల ద్వారా విద్యార్థులకు ఆంగ్ల భాషా నైపుణ్యం పెంచడంతో పాటు విషయ పరిజ్ఞానం పెంపుదలకు ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన అధ్యాపకుల బోధనలు, కంటెంట్ను అందజేస్తున్నామన్నారు. 2014-19 మధ్య ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకం కింద ఎంపికైన విద్యార్థులకు రూ.45.54 కోట్ల బకాయిలు చెల్లిస్తున్నామన్నారు. నిర్మాణంలో ఉన్న మూడు బీసీ భవనాలను పూర్తిచేయడానికి రూ.10.12 కోట్లు విడుదల చేశామన్నారు. రూ.18 కోట్లతో వసతి గృహాల్లో వంట సామాగ్రి, ఇతర వస్తువుల కొనుగోలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే హాస్టళ్లలో ఇన్వర్టర్లు ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రూ.13.10 కోట్లతో వసతి గృహాల మరమ్మతులు చేపట్టామన్నారు. బీసీ యువతను, మహిళలను ఎంఎస్ఎంఈ ద్వారా పారిశ్రామిక వేత్తలుగా రూపొదించే కార్యక్రమాన్ని చేపట్టామని, ఇప్పటికే బీసీ కార్పొరేషన్ల ద్వారా యూనిట్ల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా 1700 జనరిక్ మెడికల్ షాపులు బీసీ బిడ్డలతో ప్రారంభించబోతున్నామన్నారు. అసంపూర్తిగా నిలిచిపోయిన కాపు భవనాలను పూర్తిచేయడానికి రూ.5.41 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. ఈడబ్ల్యూఎస్ లో ఉన్న బీపీఎల్ కుటుంబాలను అభివృద్ధి చేయడానికి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు. ఏపీ బ్రాహ్మణ క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ మాదిరిగా ఇతర ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్లకు కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలు ఏర్పాటు చేసి వ్యక్తిగత, గ్రూపు రుణాలు అందించాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. దీనిలో భాగంగా ఏపీ ఆర్యవైశ్య, రెడ్డి, కమ్మ కోపరేటివ్ సొసైటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *