-గొర్రెల కాపరి ఓబులపతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు
-రహదారి ప్రమాదంలో గొర్రెల కాపరి ఓబులపతికి గాయాలు , 13 గొర్రెలు మృతి
-బాధిత కుటుంబానికి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అమలు చేసేందుకు పరిశీలించాలని ఆదేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం కోడేకండ్ల వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి ఓబులపతి తీవ్ర గాయాలవడం, 13 గొర్రెలు మృతి చెందడం పట్ల రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖామంత్రి అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన గురించి మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా పశుసంవర్ధక అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో తీవ్ర గాయాలయిన గొర్రెల కాపరి ఓబులపతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. గొర్రెల కాపరి ఓబులపతి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా గొర్రెల కొనుగోలుకు రాయితీపై రుణం అందించేందుకు అవకాశాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.