-గ్రామాల వారీగా పనుల పురోగతిని వివరించిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి
రాజానగరం, రంగంపేట, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వారికీ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ సామర్లకోట – రాజానగరం ప్రథాన రహదారి మార్గం విస్తరణ, పటిష్ఠం చేసే క్రమంలో చేపట్టిన పనులు పురోగతి, తదితర అంశాలను వివరించడం జరిగింది.
సామర్లకోట – రాజానగరం ప్రథాన రహదారి మార్గం 4 వరసల రహదారిగా అభివృద్ది కి చెంది 30 కిలో మీటర్ల లలో 16.29 కీ మి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉందని, ఇందు నిమిత్తం రూ.189 కోట్ల 87 లక్షల ప్రాజెక్ట్ అంచనాతో పనులు చేపట్టడం జరిగిందన్నారు. 2017 లో పరిపాలన ఆమోదం తో 2018 లో అక్టోబరు నెలలో పనులు చేపట్టడం జరిగిందని, వీటిని 2021ఫిబ్రవరి లో పూర్తి చెయ్యాల్సి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ పనులను 2025 ఆగష్టు నాటికి పూర్తి చేసేలా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు వారు అనుమతి ఇవ్వడం జరిగిందని, ఆ మేరకు పనులని పూర్తి చేసే క్రమంలో చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు కలెక్టరు ప్రశాంతి వివరించారు. ఎస్టీ రాజపురం వద్ద కల్వర్టు నిర్మాణ పనులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించడం జరిగింది. రాజానగరం మండలం లో రాజానగరం, రాజానగరం ట్రంఫెట్, కానవరం గ్రామాలు, రంగంపేట మండలం లో రంగంపేట , వడీసలేరు , కోటపాడు, పెద రాయవరం , ఎస్టీ రాజ పురం గ్రామాల పరిధిలో ప్రతిపాదించిన పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి వెంట జిల్లా కలెక్టర్ తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న రూట్ మ్యాప్ ప్రకటనలో గ్రామాల వారీగా పనుల పురోగతి వివరించడం జరిగింది. పరిహారం చెల్లింపుల కు చెందిన బిల్లులు అప్లోడ్ చేసినట్లు తెలిపారు.
ఈ పర్యటనలో కలెక్టర్ పి ప్రశాంతి, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ , ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, డిఎస్పీ భవ్య కిశోర్, ఏపి రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు, రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.