-శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత యన్ సూర్యారావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గంలో విద్యారంగం బలోపేతానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి కృషి చేస్తున్నారని గౌతమ్ విద్యాసంస్థల అధినేత యన్ సూర్యారావు అన్నారు. చిట్టినగర్ లోని గౌతమ్ విద్యాసంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ను శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తో కలిసి ఆవిష్కరించారు. లయన్ యన్ సూర్యారావు ఆహ్వానం మేరకు ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొని నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. అనంతరం పాఠశాల సిబ్బందికి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్ యన్ సూర్యారావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల విద్యారంగ, సమస్యల పైన ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. పశ్చిమ లోని పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా సుజనా ఫౌండేషన్ ద్వారా విద్యార్థుల, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తూ విద్యారంగం బలోపేతానికి కృషి చేస్తున్నారన్నారు. మంచి ఫలితాలు సాధించేలా టీచర్లు, ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ తులసి , వైస్ ప్రిన్సిపల్ పీ శ్రీరామ్, 47 వ డివిజన్ జనసేన అధ్యక్షులు వేంపల్లి గౌరీ శంకర్, బొల్లేపల్లి కోటేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.