Breaking News

నగరంలోని ఐలాండ్స్, డివైడర్ల నిర్వహణపై ఇంజినీరింగ్ అధికారులు దృష్టి సారించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని ఐలాండ్స్, డివైడర్ల నిర్వహణపై ఇంజినీరింగ్ అధికారులు దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శనివారం కమిషనర్ గాంధీ పార్క్ ఎదుట ఐలాండ్, డివైడర్లు, వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఎదుట పింక్ టాయ్ లెట్స్, పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, పారిశుధ్యంలను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయ కార్యదర్శులకు, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ఐలాండ్స్ అభివృద్ధి, నిర్వహణపై ఇంజినీరింగ్ అధికారులు దృష్టి సారించాలన్నారు. ఐలాండ్స్ ల్లో పచ్చదనం పెంపు, నీటి స్పింకర్ల మరమత్తులు ఉంటే ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. డివైడర్లపై పచ్చదనం కోసం నాటిన మొక్కలు కొన్ని ప్రాంతాల్లో లేవని, ఆయా ప్రాంతాల్లో నూతన మొక్కలు నాటాలని, ఉన్న మొక్కలను ఎప్పటికప్పుడు ట్రిమ్మింగ్ చేయాలని పార్క్స్ విభాగ ఏడిహెచ్ ని ఆదేశించారు. అలాగే విజ్ఞాన మందిరం ఎదుట పింక్ టాయ్ లెట్స్ ని పరిశీలించి, వాటి నిర్వహణ శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. అనంతరం ఓల్డ్ క్లబ్ రోడ్, కుగ్లర్ హాస్పిటల్ రోడ్ ల్లో పర్యటించి పారిశుధ్య పనులపై శానిటరీ ఇన్స్పెక్టర్లకు తగు ఆదేశాలు జారీ చేశారు.
పర్యటనలో ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నగరంలోని వాడుక నీరుని పూర్తిస్థాయిలో శుద్ధి చేసేలా చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని వాడుక నీరుని పూర్తిస్థాయిలో శుద్ధి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *