విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడంలో ఎప్పుడూ ముందుండే ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ మరింత మెరుగైన సేవలను వినియోగదారులకు అందించే చర్యలలో భాగంగా ది. 14`01`2025 ఉదయం 10:00 గం॥ల నుండి రాత్రి 9:00 గం॥ల వరకు స్థానికంగా పేరొందిన పైలెట్ సర్వీస్ స్టేషన్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, బందర్‌రోడ్డు, విజయవాడ-520002 నందు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వినియోగదారులకు 2025 క్యాలెండర్‌ను వినియోగదారుల మరియు వారి కుటుంబ సభ్యుల ఫోటోలతో ఉచితంగా పొందే ఏర్పాటు చేశారు. వినియోగదారులు వారి వారి కుటుంబ సభ్యులతో గవర్నర్‌పేట, బందర్ రోడ్డు నందు గల పైలెట్ సర్వీస్ స్టేషన్ (ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్)నకు వచ్చి ఫోటోలు దిగి, వారి వారి ఫోటోలతో 2025 కలర్‌ఫుల్ క్యాలెండర్‌ను ఫోటో దిగిన రోజే ఉచితముగా పొందవచ్చును. కావున ఈ అవకాశాన్ని వినియోగదారులందరూ ఉపయోగించుకోవలసినదిగా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ మరియు పైలెట్ సర్వీస్ స్టేషన్ సంయుక్తంగా కోరుచున్నారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …