ముస్లిం స్వాతంత్ర సమరయోధుడు కాలమానం ఆవిష్కరన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ సినీ రచయిత ప్రస్తుత రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ ప్రచురించిన ముస్లిం స్వాతంత్ర సమరయోధుడు కాలమానాన్ని ఈరోజు హైదరాబాదు లోని వారి కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ముస్లింల ఐక్యత కొరకు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి చేస్తున్న సేవ మాటల్లో వర్ణించలేనిది. ఈ పవిత్రమైన కార్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా & దేశ వ్యాప్తంగా విస్తరింపచేయాలని ఆయన ఫరూక్ షిబ్లీ ని కోరారు. అలాగే ఇంతమంది స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలతో కాలమానాన్ని తీసుకురావటం అభినందనీయం అని అన్నారు. మాతృ భూమి కొరకు ప్రాణాలు త్యాగం చేసిన వారు ఇంత మంది ఉన్న ముస్లిం సమాజంలో వారి త్యాగాలు ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి 10మంది ముస్లిం స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్ర ఆధారంగా వెబ్ సిరీస్ తయారు చేసి వారి రుణాన్ని తీర్చుకుందామని అన్నారు.

ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ మాట్లాడుతూ మీరు ముస్లిం స్వాతంత్ర సమరయోధుల వెబ్ సిరీస్ తయారు చేస్తే యావత్తు ముస్లిం సమాజం మీకు రుణపడి ఉంటుంది అని, మీకు ధన్యవాదాలు తెలియచేయటానికి మాటలు సరిపోవు అని ఆయన అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *