-పి. అశోక్ బాబు, శాసనమండలి సభ్యులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంతోమంది ప్రముఖులు భారతదేశంలో జన్మించారని అందులో స్వామి వివేకానంద ఒకరని శాసనమండలి సభ్యులు పి. అశోక్ బాబు తెలిపారు. రాష్ట్ర యువజన సర్వీసుల శాఖా ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నేషనల్ యూత్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు అశోక్ బాబు మాట్లాడుతూ దేశానికీ ఆస్థి యువతేనని రాబోయే 30 సంవత్సరాలు వారిదేనన్నారు. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించనున్నారన్నారు. ఇటీవల జరిగిన ఫాలీఫెస్ట్ సమిట్ లో మన యువత అద్భుత ప్రదర్శనా పాటవాలు ప్రదర్శించారన్నారు. దేశంలో యువతకు ఏది కావాలన్నా అపార అవకాశాలు నేడు ఉన్నాయన్నారు. ఇటీవల యువతలో డాక్టర్స్ ఇంజినీర్స్ కావాలనే వారి సంఖ్య బాగా పెరిగిపోయిందన్నారు. యువత వారి కెరీర్ ను వారే నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదన్నారు. అమెరికా లోని చికాగాలో స్వామీ వివేకానంద చెప్పిన విషయాలు ఎంతో మందికి ఆదర్శమన్నారు. చికాగో సదస్సులో అమెరికన్ సమాజాన్ని ఉద్దేశించి బ్రదర్స్ సిస్టర్స్ అని మొదటిగా అయన సంబోధించడం వారిని ఆకట్టుకున్నదన్నారు. భారతదేశంలో జన్మించిన ఎంతోమంది ప్రముఖుల్లో మహాత్మా గాంధీ, డా. బి.ఆర్. అంబేద్కర్ సమాజానికి ఎంతో సేవలు అందించారన్నారు. రాష్ట్రంలో యువతకు ప్రభుత్వం ఎన్నో అవకాశాలు సపోర్ట్ ను అందిస్తున్నదన్నారు. యువతలో అద్భుతాలు సృష్టించగల స్కిల్స్ ఉన్నాయన్నారు. భవిష్యత్తు కోసం కలలు కనాలిగానీ వాటిని సాకారం చేసుకునే విధంగా కష్టపడాలన్నారు. మాతృ భాషకు చాలా ప్రాముఖ్యం ఉన్నదన్నారు. ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని యువత తమ కెరీర్ ను రూపొందించుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఎప్పుడైనా మీ గ్రామానికి వెళ్ళినప్పుడు మీరు చదువుకున్న విద్య వల్ల మీ కుటుంబానికి గౌరవం తీసుకురావాలన్నారు. యువతే దేశానికీ ఆదర్శం అని కొనియాడారు.
యువజన సర్వీసుల శాఖ కమిషనర్ K. శారదావి మాట్లాడుతూ కలకత్తా నగరం ఎంతోమంది ప్రముఖులకు జన్మస్థానం గా నిలిచిందన్నారు.. అందులో ప్రముఖంగా స్వామి వివేకానంద ఒకరని అన్నారు. చికాగో నగరంలో జరిగిన ప్రపంచ సర్వ మత ప్రార్ధనల్లో పాల్గొని భారతీయతను ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.. ఆనాడే ఇండియా గురుంచి గర్వంగా తెలియజేశారన్నారు. ఆ తర్వాత దేశం నలుమూలల ఆయన ప్రాముఖ్యత నొందరన్నారు. రామకృష్ణ పరమ హంస శిష్యుడు గా రామ కృష్ణ మఠాలను దేశంలో నెలకొల్పారన్నారు. రామకృష్ణ మఠాల్లో యువతకు విద్యాబుద్ధులే కాకుండా అనేక కరిక్యులం కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. 1984వ సంవత్సరంలో జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించారన్నారు. ప్రతీ సంవత్సరం గౌరవ ప్రధాని ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. యువతీ యువకులు స్వామి వివేకానంద బోధనలు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. స్వామీ వివేకానంద 33 సంవత్సరాలు జీవించి 1500 సంవత్సరాలకు సంబందించిన సందేశాన్ని సమాజానికి అందించారన్నారు.
స్వామి వివేకానంద 162వ జయంతి కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్. వి. డి. ఎస్. రామ కృష్ణ, కృష్ణా, ఎన్ టి ఆర్ జిల్లాల సిఈవో యు. శ్రీనివాస్, ఏలూరు సిఈవో ప్రభాకరరావు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.